Share News

కాంగ్రెస్‌ గూటికి తీగల కృష్ణారెడ్డి?

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:28 AM

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత మాజీ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ మారబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

కాంగ్రెస్‌ గూటికి తీగల కృష్ణారెడ్డి?

సచివాలయంలో సీఎం రేవంత్‌తో భేటీ

హైదరాబాద్‌, మహేశ్వరం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత మాజీ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ మారబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తనకు మహేశ్వరం అసెంబ్లీ టికెట్‌ కేటాయించనందుకు కొంత కాలంగా అసంతృప్తిలో ఉన్న ఆయన త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సచివాలయంలో శనివారం ఆయన సీఎం రేంత్‌ను కలవడం ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది. టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కృష్ణారెడ్డి 2014లో మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సబితారెడ్డి చేతిలో ఓడిపోయారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్‌ మాట తప్పారని, ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశారని తీగల తన అనుచరగణం వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

రేవంత్‌ది..జనరంజక పాలన: మోత్కుపల్లి

కాంగ్రెస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు.

Updated Date - Jan 28 , 2024 | 11:30 AM