Share News

చెత్త సీఎంను చెప్పుతో కొడతా

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:13 AM

రండ పనులు చేసింది మీరు.. అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు ఘాటుగా స్పందించారు. రేవంత్‌ను ఉద్దేశించి ప్రచురించలేని భాషలో దుర్భాషలాడారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరుష పదజాలంతో దూషించారు. చెత్త సీఎం రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ

చెత్త సీఎంను చెప్పుతో కొడతా

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

చెప్పు చూపిస్తూ పరుష పదజాలంతో దూషణ

మాకూ ముతక కూతలు వస్తాయి: జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రండ పనులు చేసింది మీరు.. అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు ఘాటుగా స్పందించారు. రేవంత్‌ను ఉద్దేశించి ప్రచురించలేని భాషలో దుర్భాషలాడారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరుష పదజాలంతో దూషించారు. చెత్త సీఎం రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెప్పు చూపిస్తూ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. మంచిర్యాల, పెద్దపల్లిలో ఆయన మాట్లాడారు. ‘‘కాలం కలిసొచ్చి అందలమెక్కావ్‌... నీ అదృష్టమో, తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నవ్‌. గతంలో చిల్లర మాటలు మాట్లాడిన నువ్వు.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో పద్ధతిగా మాట్లాడాలె. పదేళ్ల పాటు తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్‌ను తిడితే ఊరుకోం.. చెప్పుదీసి కొడుతా.. ఖబడ్దార్‌’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీలో పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారని, ఎప్పుడు ఎవడు కుర్చీ లాగుతాడో, ఎవరు అంగీ లాగు లాగుతాడో తెలియని పరిస్థితి ఉందన్నారు. అదానీని రాహుల్‌ గాంఽధీ విమర్శిస్తే, రేవంత్‌ రెడ్డి దావోస్‌ వెళ్లి రూ.12 వేల కోట్ల పెట్టుబడులకు ఎలా అంగీకరించారని ప్రశ్నించారు. ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు వేయని ప్రభుత్వం.. కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం చెల్లిందచిందని మండిపడ్డారు. మంత్రి శ్రీనివా్‌సరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు సైతం పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించారన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాల గూడలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ హమీలు అమలు చేయలేని రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌పై నెపం వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్‌ నాయకులను ప్రజలే వెంటబడి చెప్పులతో కొడతారన్నారు. నిండా మూడు ఫీట్లు లేని సీఎం.. ఎమ్మెల్యే కంటే హీనంగా మాట్లాడుతున్నారన్నారు. తిట్టదలుచుకుంటే.. తమకూ మరిన్ని ముతక కూతలు వస్తాయని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుపైకి ఏపీ పోలీసులు దండెత్తి వచ్చారని, కోడ్‌ అమలులో ఉండడంతో అప్పటి సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు ఇవ్వలేకపోయారని తెలిపారు. యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సీఎం అనే విషయాన్ని మరిచిపోయారని, ఇంకా టీపీసీసీ అధ్యక్షుడిలాగే వ్యవహరిస్తునానరని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ‘‘ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని ప్రశ్నిస్తే వంద గజాల లోతున బీఆర్‌ఎ్‌సను బొంద పెడతావా? బీఆర్‌ఎ్‌సను బొంద పెట్టేటోళ్లు.. ఇకపైనా పుట్టబోరు. కేసీఆర్‌నే అసభ్య పదజాలంతో దూషిస్తావా.. బుద్ధి ఉందా నీకు’’ అని నిలదీశారు. రేవంత్‌ మాట తీరు ఇలాగే ఉంటే తెలంగాణ ప్రజలు ఆయనకు ఘోరీ కట్టడం ఖాయమనిన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పందం చేసుకున్నారని, వచ్చే ఐదేళ్లలో తెలంగాణను ఏపీలో కలిపినా కలిపేస్తారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. పెద్దపల్లిలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.

Updated Date - Feb 06 , 2024 | 04:13 AM