Share News

ఈ సమీక్షలు ఎప్పుడో నిర్వహించాల్సింది

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:07 AM

‘‘పదేళ్లు అధికారంలో ఉన్నాం.. అప్పుడూ ఇలాగే ముఖ్య నాయకులతో చర్చించి నిర్ణయాలు తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

ఈ సమీక్షలు ఎప్పుడో నిర్వహించాల్సింది

పార్టీలో కొందరికే న్యాయం జరిగింది

సంస్థాగత పటిష్ఠతపై పెద్దగా దృష్టి పెట్టలేదు

కనీసం జిల్లా, మండల కమిటీలూ వేయలేదు

‘కరీంనగర్‌’ భేటీలో బీఆర్‌ఎస్‌ నేతల ఆవేదన

హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘‘పదేళ్లు అధికారంలో ఉన్నాం.. అప్పుడూ ఇలాగే ముఖ్య నాయకులతో చర్చించి నిర్ణయాలు తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పార్టీ కేడర్‌తో సమీక్షలు జరపడం, సమావేశాలు నిర్వహించడం వంటి పనులు ఎప్పుడో చేయాల్సింది’’ అని బీఆర్‌ఎస్‌ నాయకులు అభిప్రాయపడ్డారు. పార్టీలో కొందరికే న్యాయం జరిగిందని, ఇప్పటికైనా సీనియర్లకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. తెలంగాణ భవన్‌లో గురువారం కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని కరీంనగర్‌, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌, కోరుట్ల అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ నేతలు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మధుసూదనాచారి, వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడంతోపాటు పార్టీ కేడర్‌కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, సీనియర్‌ కార్యకర్తలు క్షేత్రస్థాయి పరిస్థితులపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న వారికి గుర్తింపు లేదని, అధికారంలో ఉన్న పదేళ్లలో న్యాయం జరగకపోగా.. అడుగడుగునా నిర్లక్ష్యానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయడంపై అధిష్ఠానం దృష్టి పెట్టలేదని, గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటులోనూ విఫలమైందని ఆరోపించినట్లు తెలిసింది.

మా ఎమ్మెల్యేలెవరూ కాంగ్రె్‌సలోకి వెళ్లరు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలెవరూ.. కాంగ్రె్‌సలో చేరే ప్రసక్తేలేదని, పార్టీ అధినేత కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేేసందుకు సిద్ధంగా ఉన్నారని, తమ పార్టీ గేట్లు తెరిస్తే.. ఆ పార్టీలో ఒక్కరు కూడా మిగలరని మాజీమంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలోకి వెళ్తారని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వాళ్లు ఒక్కరిని తీసుకెళ్తే...బీఆర్‌ఎ్‌సలోకి పది మంది ఎమ్మెల్యేలు వస్తారని జోస్యం చెప్పారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా వినోద్‌కుమార్‌ను గెలిపించుకుంటామని తెలిపారు.

పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు: కేటీఆర్‌

పార్టీ ఆదేశాలు ధిక్కరిేస్త కఠిన చర్యలు తప్పవని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాసంలో జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్‌దావ వసంతసురేష్‌, జడ్పీటీసీ సభ్యులు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురే్‌షపై అవిశ్వాస తీర్మాన పెడుతున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని జడ్పీటీసీ సభ్యులు వివరించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

Updated Date - Jan 05 , 2024 | 04:07 AM