Share News

5 గ్యారెంటీలు ఇవే..

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:20 AM

దేశవ్యాప్తంగా రైతులకు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రుణ మాఫీ ప్రణాళికను సమర్థంగా అమలు చేసేందుకు శాశ్వత కమిషన్‌

5 గ్యారెంటీలు ఇవే..

మహేశ్వరం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా రైతులకు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రుణ మాఫీ ప్రణాళికను సమర్థంగా అమలు చేసేందుకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో తెలుగు ప్రతిని శనివారం తుక్కుగూడలో జరిగిన జన జాతర సభలో రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. అందులో ఐదు గ్యారంటీలకు హామీ ఇచ్చారు. అవి..

సామాజిక న్యాయం

కుల గణన: ప్రతి వ్యక్తి, వర్గం సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం కుల గణన

రిజర్వేషన్ల హక్కు: రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత: జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు ప్రత్యేక వార్షిక బడ్జెట్‌

జల్‌ జంగల్‌ జమీన్‌కై చట్టపరమైన హక్కు: అటవీ ప్రాంతంలోని గిరిజనులు, ఆదివాసుల హక్కుల చట్టం కింద వచ్చే క్లెయిమ్స్‌ సంవత్సరంలో పరిష్కారం

మన భూమి, మన పాలన: ఎస్టీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు గిరిజన, ఆదివాసీ ప్రాంతాలుగా గుర్తింపు

రైతు న్యాయం

మద్దతు ధరకు చట్టబద్ధత: స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల ఆధారంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత

రుణమాఫీ: రైతులకు రుణమాఫీ ప్రణాళికను సమర్థంగా అమలు చేయడానికి శాశ్వత కమిషన్‌ ఏర్పాటు

బీమా చెల్లింపుల ప్రత్యక్ష బదిలీ: పంట నష్టపోతే 30 రోజుల్లో బీమా సొమ్ము నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోకి జమ

సమర్థ ఎగుమతి- దిగుమతి విధానం: రైతులకు లాభసాటిగా సరికొత్త దిగుమతి - ఎగుమతి విధానం

జీఎస్టీరహిత వ్యవసాయం: వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ తొలగింపు

కార్మిక న్యాయం

ఆరోగ్య హక్కు: ఆరోగ్య హక్కు చట్టం ద్వారా ప్రతి కార్మికునికి ఉచిత నిత్యావసర రోగ నిర్ధారణ పరీక్షలు, మందులు, ఆపరేషన్‌తో కూడిన ఆరోగ్య రక్షణ

కార్మికులకు గౌరవం: జాతీయ ఉపాధి హామీ కూలీలతో పాటు కార్మికులందరికీ రూ.400 రోజు కూలీ

పట్టణ ఉపాధి హామీ: పట్టణ ప్రాంత కార్మికులకు ఉపాధి హామీ చట్టం అమలు

సామాజిక భద్రత: అసంఘటిత కార్మికులకు జీవిత, ప్రమాద బీమా వర్తింపు

ఉద్యోగ భద్రత: కీలక ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ రద్దు

యువ న్యాయం

నియామకాల భరోసా: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 30 లక్షల ఉద్యోగ ఖాళీలు జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా భర్తీ

ఏడాదికి లక్ష అప్రెంటి్‌సషిప్‌: విద్యావంతులైన యువకులకు నెలకు రూ.8,500 (సంవత్సరానికి రూ.లక్ష) ఉపకార వేతనంతో సంవత్సరంపాటు అప్రెంటి్‌సషిప్‌ శిక్షణ

ప్రశ్నపత్రాల లీకేజీకి విముక్తి: అన్ని పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టడం కోసం ప్రత్యేక చట్టం

గిగ్‌ ఆర్థిక వ్యవస్థలో సామాజిక భద్రత: గిగ్‌ కార్మికులకు సామాజిక భద్రతతో కూడిన అనువైన పని వాతావరణ కల్పన

యువ కిరణాలు: రూ.500 కోట్ల ప్రత్యేక నిధితో అంకుర సంస్థలు (స్టార్ట్‌పలు) స్థాపించే యువతకు ప్రోత్సాహకాలు

మహిళా న్యాయం

మహాలక్ష్మి: ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు సంవత్సరానికి రూ.లక్ష సాయం

సగం జనాభాకు సంపూర్ణ హక్కులు: కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్‌

మహిళా శక్తికి గౌరవం: ఆశ, మధ్యాహ్న భోజన పథకం అమలుచేసే అంగన్‌వాడీ కార్యకర్తలకు అధిక జీతం, కేంద్ర ప్రభుత్వ వాటా రెట్టింపు

మైత్రిలు: మహిళలకు చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి తెలియచేసేందుకు ప్రతి గ్రామంలో ఒక మైత్రి అధికారి నియామకం

సావిత్రీబాయ్‌ పూలే వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్లు: ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు వసతి గృహాలు రెట్టింపు

Updated Date - Apr 07 , 2024 | 03:20 AM