Share News

దుకాణంలో చోరీ.. బ్యాంకులో తాకట్టు

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:23 AM

సరుకుల కొనుగోలు చేసే దుకాణానికే కన్నం వేసిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బీసన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

దుకాణంలో చోరీ.. బ్యాంకులో తాకట్టు

నాగార్జునసాగర్‌, ఫిబ్రవరి 6: సరుకుల కొనుగోలు చేసే దుకాణానికే కన్నం వేసిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బీసన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనుముల మండలం చిన్న అనుమల గ్రామానికి చెందిన ఆట్రోడైవర్‌ కురాకుల మల్లయ్య(31) పెద్దవూర మండలం గర్నెకుంట గ్రామంలో ఇంట్లోనే కిరాణ దుకాణం నిర్వహిస్తున్న ఘనపురం అంజయ్య వద్దకు వెళ్లి ప్రతి నెలా సరుకులు కొనుగోలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అంజయ్య దుకాణ తాళాలు, బీరువా తాళాలు ఎక్కడ పెడుతున్నాడో గమనించాడు. గతేడాది ఆగస్టు 28వ తేదీన అంజయ్య ఊరెళ్లిన సమయంలో గర్నెకుంటకు చేరుకున్న మధ్యాహ్నం మల్లయ్య దుకాణతాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. 12 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదును దొంగిలించాడు. చోరీ చేసిన వాటిలో 2.5 తులాల నల్లపూసల గొలుసు మినహా మిగిలిన బంగారు ఆభరణాలను హాలియా ఏపీజీవీబీలో తాకట్టుపెట్టాడు. గతేడాది ఆగస్టు 29న అంజయ్య భార్య లావణ్య ఫి ర్యాదు మేరకు పెద్దవూర పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేసి ఎస్‌ఐ రమేష్‌ దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పెద్దవూర చౌరస్తాలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న మల్లయ్య ను విచారించగా నల్లపూసల గొలుసును విక్రయించడానికి దేవరకొండకు వెళ్తున్నట్లు తెలిపారు. అతడి బ్యాగును తనిఖీ చేయగా హాలియా ఏపీజీవీబీలో తాకట్టు పెట్టిన బంగారం తాలుకూ చిటీ, రూ.50 వేల నగదును గుర్తించారు. విచారణ చేయగా తాను గత ఏడాది ఆగస్టులో గర్నెకుంటలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో సదరు నిందితుడిని నిడమనూరు కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో సహకరించిన ఎస్‌ఐ రమేష్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, యోగి, కానిస్టేబుల్స్‌ కిషన్‌, రాజు, రవి, హోంగార్డు మధు, సైదులు, హునీయా, రవి నాయక్‌, హనుమంతులను సీఐ భీసన్న అభినందించారు.

Updated Date - Feb 07 , 2024 | 10:14 AM