Share News

నాణ్యమైన సేవలతో ప్రజల విశ్వాసం పొందాలి

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:18 AM

నాణ్యమైన సేవలతో ప్రజల విశ్వాసాన్ని పొందాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

నాణ్యమైన సేవలతో ప్రజల విశ్వాసం పొందాలి
జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, జూన్‌ 16: నాణ్యమైన సేవలతో ప్రజల విశ్వాసాన్ని పొందాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో నూతనంగా నిర్మించిన త్రిపుర ఇన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ ప్రజలకు కార్పొరేట్‌ స్థాయిలో సేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో త్రిపుర ఇన్‌ను నిర్మించడం అభినందనీయమని నిర్వాహకులు వేనేపల్లి లక్ష్మణ్‌రావు, గోన విష్ణువర్ధన్‌రావులను అభినందించారు. త్రిపుర ఇన్‌ నిర్వాహకులు మాట్లాడుతూ పట్టణానికి దూర ప్రాంతాల నుంచి జిల్లాకేంద్రానికి వచ్చే వ్యాపారస్తులు, రాజకీ య ప్రముఖులు, వీఐపీలు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు బస చేయడానికి విలాసవంతమైన సౌకర్యాలతో నిర్మించినట్లు తెలిపారు. ఎగ్జిక్యూటీవ్‌ రూమ్స్‌, డీలక్స్‌ రూమ్స్‌, డీలక్స్‌ ప్లస్‌ రూమ్స్‌లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 24గంటల పవర్‌ బ్యాకప్‌ ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో వేనేపల్లి చందర్‌రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, గుమ్ముల మోహన్‌రెడ్డి, బండారు ప్రసాద్‌, మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌, బోయినపల్లి జగన్మోహన్‌రావు, రావిరాల వెంకటేశ్వర్లు, ఉట్కూరి వెంకట్‌రెడ్డి, పాండురంగారావు, వేనేపల్లి సాత్విక్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:18 AM