Share News

పోలింగ్‌ సిబ్బంది మూడో దశ ర్యాండమైజేషన్‌ పూర్తి

ABN , Publish Date - May 12 , 2024 | 12:10 AM

జిల్లాలో జరిగే లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ సిబ్బంది మూడో దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ తెలిపారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ఆయన ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్‌ గుప్తా, అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ, జీవీ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌తో కలిసి ఆన్‌లైన్‌ ద్వారా పోలింగ్‌ సిబ్బంది మూడో దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను నిర్వహించారు.

పోలింగ్‌ సిబ్బంది మూడో దశ ర్యాండమైజేషన్‌ పూర్తి
ఆన్‌లైన్‌ ద్వారా ర్యాండమైజేషన్‌ పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌, ఎన్నికల పరిశీలకులు

- పెద్దపల్లి రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌

పెద్దపల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరిగే లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ సిబ్బంది మూడో దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ తెలిపారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ఆయన ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్‌ గుప్తా, అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ, జీవీ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌తో కలిసి ఆన్‌లైన్‌ ద్వారా పోలింగ్‌ సిబ్బంది మూడో దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో 840 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, మూడో దశ పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలింగ్‌ సిబ్బందిని కేటాయించామని తెలిపారు. జిల్లాలోని రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్‌లో 260 పోలింగ్‌ కేంద్రాలకు 306 పోలింగ్‌ బృందాలు, మంథని అసెంబ్లీ సెగ్మెంట్‌లో 290 పోలింగ్‌ కేంద్రాలకు 339 పోలింగ్‌ బృందాలు, పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో 290 పోలింగ్‌ కేంద్రాలకు 342 పోలింగ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మూడోదశ ర్యాండమైజేషన్‌లో పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలింగ్‌ బృందాలను ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగించుకొని పారదర్శకంగా కేటాయించామన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఐదు మహిళా పోలింగ్‌ కేంద్రాలు, ఒక యూత్‌ పోలింగ్‌ కేంద్రాలు, ఒక దివ్యాంగుల పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను కేటాయించామన్నారు. రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఉన్న ఒక సమస్యాత్మక లోకేషన్‌కు ఇద్దరు మైక్రో అబ్జర్వర్లను, మంథని అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఉన్న 47 సమస్యాత్మక లోకేషన్‌లకు 57 మంది మైక్రో అబ్జర్వర్లను, పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధి ఉన్న 16 సమస్యాత్మక లోకేషన్‌లకు 20 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించామని తెలిపారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్‌ జగిత్యాల జిల్లా కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా, మంచిర్యాల, చెన్నూరు బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ బి సంతోష్‌ పోలింగ్‌ బృందాలను, మైక్రో అబ్జర్వర్లను ఆన్‌లైన్‌ ద్వారా పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల పరిశీలకులు రావిష్‌ గుప్త ఆధ్వర్యంలో కేటాయించారు. ర్యాండమైజేషన్‌ కార్యక్రమంలో ఆర్డీవో హనుమానాయక్‌, డీఈవో మాధవి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 12:10 AM