ఇందిరమ్మ ఇళ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:32 AM
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఎ లాంటి అవాంతరాలు లేకుండా చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అ ధికారులను ఆదేశించారు. శనివారం పెగడపల్లిలోని పలు వార్డుల్లో ఇళ్లు లేని నిరుపేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే సిబ్బంది చేస్తున్న ఇం టింటి సర్వేను కలెక్టర్ తనిఖీ చేశారు.

కలెక్టర్ సత్యప్రసాద్
పెగడపల్లి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఎ లాంటి అవాంతరాలు లేకుండా చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అ ధికారులను ఆదేశించారు. శనివారం పెగడపల్లిలోని పలు వార్డుల్లో ఇళ్లు లేని నిరుపేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే సిబ్బంది చేస్తున్న ఇం టింటి సర్వేను కలెక్టర్ తనిఖీ చేశారు. యాప్ ద్వారా సర్వే చేయాలన్నారు. నిరు పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. లబ్దిదారుల వివరా లు ఆప్‌లో నమోదు చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. అనంతరం పెగడ పల్లి బతిక నపల్లిలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠదావకంపోస్ట్, డంపింగ్ యార్డులను పరిశీలించారు. వైకుంఠదామంలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలన్నారు. అయితుపల్లిలో నర్సరీని, జామ తోటను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీపీవో రఘు వరణ్, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డ్డి, తహసీల్దార్ రవీందర్, సంబంది అధికారులు పాల్గొన్నారు.