అమరవీరుల త్యాగాలు మరువలేనివి
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:57 AM
దేశం కో సం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని దేవరకొండ స్పో ర్ట్స్ అసోసియేషన అధ్యక్షుడు ఎనవీటీ అన్నారు.
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): దేశం కో సం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని దేవరకొండ స్పో ర్ట్స్ అసోసియేషన అధ్యక్షుడు ఎనవీటీ అన్నారు. సో మవారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన భవనం లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పు రస్కరించుకొని పోలీస్ అమరవీరుల స్తూపానికి పూ లమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. స మాజంలో శాంతిభద్రతలు కాపాడటమే లక్ష్యంగా పో లీసులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. దేశ సరిహద్దులలో సైనికులు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్నారని గుర్తు చేశారు. పోలీస్ అమరవీరులకు కొవ్వత్తులతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ ఉమామహేశ్వర్, స్పోర్ట్స్ అ సోసియేషన సభ్యులు శ్రీధర్‌గౌడ్, కృష్ణకిషోర్, భాస్కర్‌రెడ్డి, రాజు, కృష్ణ, వెంకటేష్ పాల్గొన్నారు.
ఫ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండలో సోమవారం రాత్రి పోలీసులు, స్పోర్ట్స్ అసోసియేషన సభ్యులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అమరుల త్యాగాల వల్లే నేడు అంద రం ప్రశాంతంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో సీఐ నరసింహులు, ఎస్‌ఐ రమేష్, దానియాల్, వెంకట య్య, సభ్యులు ఎనవీటీ, తదితరులు పాల్గొన్నారు.