Share News

రాజీ మార్గమే రాజ మార్గం

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:37 PM

రాజీ మార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ సున్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు.

రాజీ మార్గమే రాజ మార్గం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ సున్నం శ్రీనివాస్‌ రెడ్డి

వికారాబాద్‌ , జూన్‌8: రాజీ మార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ సున్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్‌ జిల్లా లో మొత్తం 2,652 కేసులు రాజీ అయ్యాయని తెలిపారు. వికారాబాద్‌లో 636 కేసులు, పరిగి కోర్టులో 461 కేసులు, తాండూరు కోర్టులో 1,216 కేసులు రాజీతో పరిష్కారమయ్యాయన్నారు. ప్రతి మూడు నెలలకోసారి మెగా లోక్‌అదాలత్‌ ఉంటుందని ఇందులో రోడ్డుప్రమాదాల కేసులు, డ్రంకెన్‌డైరవ్‌ కేసులు, భూతగాదాల కేసులు, భార్యాభర్తల కేసులు, చిన్నచిన్న కొట్లాట కేసులు, బ్యాంక్‌ అప్పుల కేసులు లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు. అన్నదమ్ముల మధ్య భూమి సమస్య ఉన్నప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ, దానిని సాగదీసి పంతాలకు పోయి కోర్టుల చుట్టూ తిరిగి బంధాలను దూరం చేసుకుని సమయం వృథా చేసుకోవద్దన్నారు. మధ్యవర్తుల మాటలను పట్టుకుని చిన్నచిన్న తగాదాలు పెద్దవిగా చేసుకోవద్దన్నారు. ఈ జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా రాజీ పడినట్లు అయితే ఇరు పక్షాలు గెలిచినట్లేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిషోర్‌, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి శీతల్‌, అదనపు న్యాయమూర్తి శ్రుతిదూత, ఎస్పీ కోటిరెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటేష్‌ ఉపాధ్యక్షుడు సయ్యద్‌ కయ్యుమ్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేశ్వర్‌ అన్వేష్‌ సింగ్‌, సమీన బేగం, న్యాయవాదులు, శంకరయ్య . నాగరాజు శ్రీనివాసరావు, వెంకటేష్‌, బి.నారాయణ, రాము, రాజు, తులసీరామ్‌, పోలీసు అధికారులు కోర్ట్‌సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:37 PM