Share News

నేర నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకం

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:31 PM

నేర నియంత్రణలో జిల్లా పోలీసులు కీలకంగా వ్యవహరించాలని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు.

నేర నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌

- మహిళల రక్షణలో షీటీం కీలకంగా వ్యవహరించింది

- డ్రంకెన్‌ డ్రైవ్‌లో 34మందికి జైలు శిక్ష

- విలేకరుల సమావేశంలో ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌

నాగర్‌కర్నూల్‌ క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : నేర నియంత్రణలో జిల్లా పోలీసులు కీలకంగా వ్యవహరించాలని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు. కార్యాలయ సముదాయంలో వార్షిక నేర నియంత్రణపై సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావే శంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ, దొంగతనాలను అరికట్ట డం, మద్యంతాగి వాహనాలు నడిపే వారిపై తీసుకునే చర్యల్లో భాగంగా జిల్లా పోలీసులు కీలకంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నా రు. జిల్లాలు క్రైమ్‌ రేటు తగ్గిందని ఆయన పే ర్కొన్నారు. ఏడాది కాలంలో వీఐపీలు పీఎం, సీఎంల సభలు సమావేశాలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో జిల్లా పోలీసులు కీల కంగా వ్యవహరించారన్నారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టడంలో మద్యం తాగి వాహనాలు నడప డం, ట్రిబుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ లేకుండా వాహనం నడపడం, డ్రై వింగ్‌ లైసెన్సు లేకుండా వాహనా లు నడిపిన వారిపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంవత్సర కాలంలో 7,909 ఫిర్యాదులు రావ డంతో వాటిపై విచారణ జరిపి 4007 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. జిల్లా లో ప్రశాంత వాతావరణం ఉండేందుకు 24గం టలు పోలీస్‌ వ్యవస్థ పని చేసిందన్నారు.

ఫ డ్రగ్స్‌ నియంత్రణ : డ్రగ్స్‌ నియంత్రణ కోసం పోలీసులు టీంలుగా ఏర్పడి నిరంతరం తనిఖీలు చేసి చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలి పారు. జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్‌ 7 కేసులు నమో దు చేసి 301గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని 12మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.

ఫ సైబర్‌ క్రైమ్‌ : జిల్లాలో ఏటీఎం, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌కార్డు ఓఎల్‌ఎక్స్‌ ఆన్‌లైన్‌ మోసా లకు గురై 95 సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోద య్యాయని ఆయన తెలిపారు. వాటిలో ఐదు కేసులను ఛేదించి బాధితులకు జరిగిన నష్టా న్ని అందించినట్లు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జిల్లాలో నిఘా పటిష్టం చేసి నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్న పోలీస్‌ అధికారులను, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:31 PM