తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్ర కీలకం
ABN , Publish Date - Jan 22 , 2024 | 12:06 AM
తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్ర కీలకమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.
వలిగొండ, జనవరి 21: తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్ర కీలకమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డికి శనివారం నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. సబ్బండ వర్గాలు సమష్టిగా, స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నా యని తెలిపారు. రాస్తారోకోలు, సకల జనుల సమ్మెలో ఉద్యో గుల పెన్‌డౌన్, విద్యార్థుల తరగతుల బహిష్కరణ, వంటావార్పు, కళాకారుల ఆటాపాటలతో దూంధాంలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిలి పారని కొనియాడారు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి లాంటి ఉద్యమ కారులెందరో తమ ప్రాణాలను సైతం రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి ఉద్యమ స్పూర్తిని రగిలించారని కొనియాడారు. ప్రొఫెసర్ కోదం డరాం లాంటి మేధావి జేఏసీ చైర్మన్‌గా ముందుండి ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేస్తే నాటి సీఎం కేసీఆర్ ఆ చరి త్రను మరిచి అంతా తనవల్లే తెలంగాణ సాధ్యమైందని అహంకార పూరితంగా వ్యవహరించారన్నారు. కేసీఆర్ పది సంవత్స రాల పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. నేడు సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్య పాలన సాగుతోందన్నారు. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించిన ఘనత తెలంగాణ ఉద్యమకారులదేనని అని అన్నారు. సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి కృష్టఫర్ అఽధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్‌రాజు, జడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి, సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్, ఎంపీటీసీ యశోధ, ఉద్య మకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జ్యోతిరెడ్డి, కార్యదర్శి మాధవి, ఉపా ధ్యక్షురాలు ఉమారాణి, నాయకులు కళ్లెం లక్ష్మారెడ్డి, బత్తిని రవీందర్, పబ్బు ఉపేందర్ బోస్, మారగోని శ్రీనివాస్, గంధమల్ల మల్లమ్మ, కొండూరి నీలమ్మ, పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు.