Share News

రోడ్లు ఇలా..వెళ్లేది ఎలా..

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:48 AM

ధర్మాపురం - మెట్టుబండ క్రాస్‌ రోడ్డులో అధ్వానంగా ఉన్న రహదారి

రోడ్లు ఇలా..వెళ్లేది ఎలా..
ధర్మాపురం - మెట్టుబండ క్రాస్‌ రోడ్డులో అధ్వానంగా ఉన్న రహదారి

ఇబ్బంది పడుతున్న జనం

చిన్నపాటి వర్షం పడినా మండలంలోని రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయి. దీంతో ప్రజలు రాక పోకలను తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. అధ్వా నంగా ఉన్న రోడ్లను ఎవరూ పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- పెనపహాడ్‌

మండలంలోని ధర్మాపురం గ్రామం నుంచి మెట్టుబండ వరకు మూడు మీటర్లదూరం ఉన్న రోడ్డు బురదమయంగా మారడంతో ప్రయాణి కులకు చాలా ఇబ్బందిగా ఉంది. 2018-19 సంవత్సరంలో ఎస్‌జీఎఫ్‌ నిధులు రూ.5లక్షలతో ఈ ప్రాంతంలో మట్టి రోడ్డును నిర్మించారు. కొన్ని నెలల్లోనే ఈ రోడ్డులో గుంతలు ఏర్పడి బైకులూ వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో పాటు మండలంలోని మేగ్యాతండా నుంచి రంగయ్యగూడెం వరకు, అన్నారం నుంచి లింగాల గ్రామం వరకు, పొట్లపహాడ్‌ నుంచి మాచారం క్రాస్‌ రోడ్డు వరకు, భక్తాళాపురం నుంచి నేలమర్రి వరకు, గాజులమొల్కాపురం నుంచి నేలమర్రి, అనంతారం క్రాస్‌ రోడ్డు నుం చి మహ్మదాపురం వరకు, దుబ్బతండా నుంచి ఈదులవాగు తండా రోడ్లలో వర్షం వస్తే నడిచే పరిస్థితి లేదు.ప్రభుత్వం స్పందించి ఈ మట్టి లింకు రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.

బీటీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తాం

ప్రస్తుతానికి నిధులు లేవు. సమస్యను ఉన్నతాధికారులతో మాట్లాడి రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతాం. ప్రస్తుతానికి ఈ రహదారులను తాత్కాలికంగా మరమ్మతులు చేస్తాం

- కిరణ్‌, ఏఈ, పీఆర్‌

Updated Date - Jun 08 , 2024 | 01:16 AM