ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:46 AM
ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలుచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలి
నల్లగొండరూరల్, డిసెంబరు 30: ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలుచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. పట్ట ణంలోని దొడ్డి కొమరయ్య భవనంలో సోమవారం నిర్వహిం చిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మా ట్లాడారు. ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చే స్తానని ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైంద ని అన్నారు. గత ప్రభుత్వంలో రేషనకార్డులు లేక ప్రజలు అనే ఇబ్బందులు పడ్డారని అన్నారు. గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. కొ న్ని గ్రామాల్లో లింకు రోడ్డు లేక పక్కనే ఉన్న ఎక్కువ కిలో మీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. దొండ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా క మిటీ సభ్యురాలు కొండ అనురాధ సీపీఎం మండల కార్యద ర్శి నలుపరాజు సైదులు, వెంకన్న, సత్యనారాయణ పాల్గొన్నారు.