Share News

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:16 PM

ఉద్యోగ, ఉపా ధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక పరమైన అంశాలతో పాటు ఎదుర్కొంటున్న సమస్యలను తక్ష ణమే పరిష్కరించాలని తపస్‌ జిల్లా అధ్యక్షు డు దెంది రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న తపస్‌ నాయకులు

- తపస్‌ జిల్లా అధ్యక్షుడు దెంది రాజిరెడ్డి

- తపస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగ, ఉపా ధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక పరమైన అంశాలతో పాటు ఎదుర్కొంటున్న సమస్యలను తక్ష ణమే పరిష్కరించాలని తపస్‌ జిల్లా అధ్యక్షు డు దెంది రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగ ళవారం రాష్ట్ర వ్యాప్త ధర్మాగ్రహ దీక్ష పిలుపు లో భాగంగా తపస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల ను నవంబరు 22 లోగా పరిష్కరించకపోతే హైదరాబాదులో ధర్మాగ్రహ దీక్ష పేపడతామ ని హెచ్చరించారు. అనంతరం పలు డిమాం డ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్‌ ఏవో చంద్రశేఖర్‌కు అందజేశారు. కార్యక్రమంలో త పస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మనమోని శేఖర్‌, రాష్ట్ర భాధ్యులు డాక్టర్‌ సురేఖ, శ్రీనివాసులు, పెంట్యానాయక్‌, జిల్లా నాయకులు నరేందర్‌ రెడ్డి, జైపాల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, రాజశేఖర్‌రావు, జగదీష్‌, విజయ్‌రెడ్డి, హరికృష్ణ, భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రఘు, గోవింద్‌ రెడ్డి, నారాయణరెడ్డి, సతీష్‌కుమార్‌, సూర్యనా రాయణ, రాజవర్దన్‌రెడ్డి, మల్లేష్‌, నిరంజన్‌, కృష్ణప్రసాద్‌ తదితరులుపాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 11:16 PM