Kumaram Bheem Asifabad- ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 06 , 2024 | 09:24 PM
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ కోరారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న చపట్టనున్న భారత్ బంద్ సమ్మె నోటీసును ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మెడికల్ అధికారికి మంగళవారం అందజేశారు.
రెబ్బెన, ఫిబ్రవరి 6: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ కోరారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న చపట్టనున్న భారత్ బంద్ సమ్మె నోటీసును ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మెడికల్ అధికారికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల16న భారత్ బంద్ చేపడుతున్నట్టు తెలిపారు. ఈ బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను కూడా పరిష్కరించాలనారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు రమ, సుకన్య, అనిత, స్వప్న, సుజాత, సునీత, లలితతో పాటు తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్: సీఐటీయూ సంఘం ఆధ్వర్యంలో క్యాజువల్ కార్మికులు ఈ నెల 16న చేపట్టను న్న దేశ వ్యాప్త సమ్మె, గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం రైల్వే పీఓడబ్ల్యూ అధికారి మహి మీనాకు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు ముంజం ఆనంద్ కుమార్‌తో పాటు కార్మికులు పాల్గొన్నారు.