Share News

నల్లగొండలో గులాబీ జెండా ఎగరడం ఖాయం

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:36 PM

నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు.

 నల్లగొండలో గులాబీ జెండా ఎగరడం ఖాయం
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కృష్ణారెడ్డి, భూపాల్‌రెడ్డి

నల్లగొండలో గులాబీ జెండా ఎగరడం ఖాయం

బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి

నల్లగొండ, ఏ ప్రిల్‌ 26: నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ప్రజలు, రైతులు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఐదు నెలలలోనే అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఇంతవరకు రైతుబంఽధు వేయలేదని, పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల కోసం ప్ర భుత్వం ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని మభ్య పెడుతుందని వి మర్శించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా అమలుకావడం లేదని విమర్శించారు. నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెంది న రాజుతో పాటు పలువురు టీఆర్‌ఎ్‌సలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, నాయకులు భిక్షం, శంకర్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:36 PM