కొనసాగుతున్న శతచండీ మహాసుదర్శన యాగం
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:04 AM
మండలంలోని వేంపేట గ్రామంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మూగు రోజుల నుంచి జరుగుతున్న శతచండీ మహాసుదర్శన నారసింహ యాగం కొనసాగుతోంది.

మెట్‌పల్లి రూరల్, డిసెంబర్, 27 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వేంపేట గ్రామంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో మూగు రోజుల నుంచి జరుగుతున్న శతచండీ మహాసుదర్శన నారసింహ యాగం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు తదితర కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీచక్రపాణి వామనాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. మెట్‌పల్లి, మల్లాపూర్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తమ కుటుంబ సమేతంగా తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వేదపండితులు శ్రీహరితీర్థస్వామి, శ్రీచక్రపాణి వామనాచార్యుల వేదమంత్రోత్సవాల మధ్య స్థాపిత దేవతా ఆరాధనలు, చండీపారాయణము, సుదర్శనము, హవనములు వంటి కార్యక్రమాలు నిర్వహించినంతరం తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. శనివారం ముగింపు ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మ, స్వామి వారిలను దర్శనం చేసుకోవాలని పురోహితులు, ఆలయ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్‌కుమార్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపినంతరం పురోహితులు శాలువతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ, గామాభివృద్ధి కమిటీ నాయకులు, సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.