Share News

ఇల్లందులో అట్టుడికిన ‘అవిశ్వాసం’!

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:52 AM

అవిశ్వాస సమావేశం సందర్భంగా భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మునిసిపల్‌ కార్యాలయం రణరంగంగా మారింది. దాడులు, కిడ్నా్‌పలు సినిమా దృశ్యాలను తలపించాయి. ఇల్లెందు బీఆర్‌ఎస్‌ నేత కొండపల్లి గణేష్‌ నాయకత్వంలో నిర్వహించిన క్యాంపు నుంచి 17 మంది

ఇల్లందులో అట్టుడికిన ‘అవిశ్వాసం’!

కిడ్నాప్‌, దాడులతో దద్దరిల్లిన మున్సిపల్‌ ఆఫీసు

చివరికి కోరం లేక వీగిపోయిన అవిశ్వాసం

‘ఖానాపూర్‌’లో అవిశ్వాసానికి ఓకే

ఇల్లెందు, ఖానాపూర్‌, నల్లగొండ టౌన్‌, ఫిబ్రవరి 5: అవిశ్వాస సమావేశం సందర్భంగా భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మునిసిపల్‌ కార్యాలయం రణరంగంగా మారింది. దాడులు, కిడ్నా్‌పలు సినిమా దృశ్యాలను తలపించాయి. ఇల్లెందు బీఆర్‌ఎస్‌ నేత కొండపల్లి గణేష్‌ నాయకత్వంలో నిర్వహించిన క్యాంపు నుంచి 17 మంది కౌన్సిలర్లు సోమవారం ఉదయం మునిసిపల్‌ ప్రత్యేక సమావేశంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన అనుచరులు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ కొక్కు నాగేశ్వరావును ఎంపీపీ కార్యాలయంలో నిర్బంధించారు. అదే సమయంలో సీపీఐ కౌన్సిలర్‌ కుమ్మరి రవీందర్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారు. అనంతరం ఇరువర్గాలు ఎంపీపీ కార్యాలయం వద్దకు చేరుకొని బాహాబాహీకి తలపడడంతో పాటు, ఎంపీపీ సమావేశ మందిరం అద్దాలను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో కౌన్సిలర్‌ నాగేశ్వరావును ఎమ్మెల్యే కనకయ్య తన కారులో రహస్య ప్రాంతానికి తరలించారు. కాగా, దాడికి గురైన కుమ్మరి రవీందర్‌ అవిశ్వాస సమావేశంలో పాల్గొనకుండా అదృశ్యమయ్యారు. అనంతరం ఆర్‌డీవో శిరీష ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశానికి 17 మంది హాజరు కావల్సి ఉండగా 15 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావడంతో కోరం లేక అవిశ్వాసం వీగిపోయింది. కాగా, తన భర్త నాగేశ్వరరావును ఎమ్మెల్యే, మునిసిపల్‌ చైర్మన్‌లు కిడ్నాప్‌ చేశారని, తన భర్తకు రక్షణ కల్పించలేదని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్‌ భార్య వెంకటలక్ష్మి బంధువులతో మునిసిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యే కోరం, మరో 16 మందిపై పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. కాగా, నాగేశ్వరరావును సాయంత్రం విడుదల చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

ఏడాదిగా వాయిదా పడుతూ...

ఏడాదిగా వాయిదా పడుతూ వచ్చిన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ అవిశ్వాస ప్రక్రియ ఎట్టకేలకు సోమవారం ము గిసింది. బీఆర్‌ఎ్‌సకు చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.

నల్లగొండ మునిసిపల్‌ పీఠం కాంగ్రెస్‌ కైవసం

నల్లగొండ మునిసిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుంది. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్‌, 38వ వార్డు కౌన్సిలర్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన చైర్మన్‌ మందడి సైదిరెడ్డిపై జనవరి 8న నిర్వహించిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆ పార్టీ చైర్మన్‌ పీఠాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో చైర్మన్‌ ఎన్నిక కోసం సోమవారం మునిసిపల్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇతర పార్టీల నుంచి ఎవరూ చైర్మన్‌ స్థానానికి పోటీకి ముందుకు రాకపోవడంతో శ్రీనివా్‌సరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్య ప్రకటించా రు. కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైన అబ్బగోని రమేష్‌ ఎన్నికల సమయంలో కాం గ్రెస్‌లో చేరారు. అవిశ్వాసం నెగ్గిన నాటి నుంచి ఆయనే ఇన్‌చార్జి చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 03:52 AM