మత్స్య సంపద పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:58 AM
రాష్ట్రంలో మత్స్య సంపద పెంచి గంగపుత్రులకు జీవనోపాధి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పే ర్కొన్నారు. సోమవారం మండలంలోని తాండ్ర్యాలలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా ఊర చెరువులో 30 వేల చేప లను వదిలిన అనంతరం మాట్లాడారు.
కథలాపూర్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మత్స్య సంపద పెంచి గంగపుత్రులకు జీవనోపాధి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పే ర్కొన్నారు. సోమవారం మండలంలోని తాండ్ర్యాలలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా ఊర చెరువులో 30 వేల చేప లను వదిలిన అనంతరం మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో చెరువులు ధ్వంసం కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్ర థమ పాధాన్యంగా చెరువులు, కుంటలను మరమ్మతులు చేయా లని సంకల్పించినట్టు చెప్పారు. ఆ క్రమంలోనే ఊరచెరువు మత్తడి ని నిర్మించడం వల్ల ప్రస్తుతం చెరువుకు జలకళ వచ్చిందన్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగు నీటి అవసరాలు తీర డమే కాకుండా మత్స్య సంపద పెరిగి స్థానిక మత్స్యకారులకు ఉ పాధి లభించనుందన్నారు. సూరమ్మ చెరువు కుడి, ఎడమ కాలు వల్లో భూములు కోల్పోతున్న రైతులకు రు. 10 కోట్లు కొద్ది రోజుల్లో మంజూరు కానున్నాయని పనులు కూడా ప్రారంభించబోతున్నా మన్నారు. జిల్లా మత్స్యకార అధికారిణి విజయభారతి మాట్లాడు తూ జిల్లాలో 261 మత్స్య సహాకార సంఘాలు ఉండగా అందులో 18వేల 500 మంది సభ్యులు ఉన్నారని వివరించారు. 237 చెరువు ల్లో 84 లక్షల చేపలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామ న్నారు. వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, కథలాపూర్ చె రువుల్లో 20 లక్షల చేపలు పెంచుతామని పేర్కొన్నారు. మత్స్య కా రులు గ్రూపు ఇన్సూరెన్స్ పథకం సద్వినియోగం చేసుకోవాలని అం దుకు ప్రీమీయం ప్రభుత్వమే చెల్లింస్తుందన్నారు. మత్స్యకారులకు మత్స్యబందు పథకం అమలు చేయాలని జిల్లా మత్స్య పారి శ్రా మిక సహాకార సంఘం చీఫ్ ప్రమోటర్ పల్లికొండ ప్రవీణ్ ఎమ్మె ల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఏవో యోగి త, ఆర్‌ఐ నగేశ్, పీసీసీ కార్యవర్గ సభ్యులు తొట్ల అంజయ్య, మం డల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజీం, రాష్ట్ర ఫిషరీస్ విభాగం కార్యదర్శి కల్లెడ గంగా ధర్, జిల్లా కార్యదర్శి గోపిడి ధనుంజయ్‌రెడ్డి ఉన్నారు.