Share News

మహిమాన్వితమైన సింహగిరి క్షేత్రం

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:25 PM

లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం మనందరిపై ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

మహిమాన్వితమైన సింహగిరి క్షేత్రం
స్వామికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మునిసిపల్‌ చైర్మన్‌, ఆలయ కమిటీ చైర్మన్‌

- లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

- పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మునిసిపల్‌ చైర్మన్‌

పాలమూరు, ఫిబ్రవరి 20 : లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం మనందరిపై ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 37వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌లతో కలిసి పట్టువస్త్రాలను సమర్పించారు. ఎంతో మహి మాన్వితమైన సింహగిరి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించటం అదృష్టమని అన్నారు. 37 ఏళ్ల నుంచి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఆల య కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించటం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం నిర్వాహకులు అతిథులకు స్వామికి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయంలో పూజారులచే ప్రత్యేక సుదర్శన నరసింహ హోమం చేయించారు. కార్యక్ర మంలో ఆలయ కమిటీ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రమౌళిగుప్తా, ఈఓ రంగాచార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఓంప్రకాష్‌భాంగర్‌, సూది రాము, పోల శ్రీనివాస్‌, ఎం.రమేష్‌, డి.బాలకిష్టయ్య, ఉమారాణి, కె.శేఖర్‌, సత్యం పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:25 PM