మూణ్నాళ్ల ముచ్చటే..
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:28 AM
లక్ష లు వెచ్చించి నిర్మించిన బస్టాండ్‌ను అధికారులు లక్షణంగా వదిలేశారు.
మూణ్నాళ్ల ముచ్చటే..
లక్షలు వెచ్చించారు, లక్షణంగా వదిలేశారు
కట్టంగూరులో నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్
కట్టంగూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): లక్ష లు వెచ్చించి నిర్మించిన బస్టాండ్‌ను అధికారులు లక్షణంగా వదిలేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో ప్రతీ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మించాలనే తలంపుతో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం 1999లో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కట్టంగూరు మండల కేంద్రంలో బస్‌షెల్టర్ నిర్మాణం కోసం 1999లో సుమారు రూ.9 లక్షలు వెచ్చించి నిర్మించారు. అప్పట్లో అధికారుల ముందుచూపు లేక బస్టాండ్‌ను గ్రామశివారులో నిర్మించారు. పట్టుమని పద్ళ్ని రోజులు కూడా ఆర్టీసీ లి!బస్సులు బస్టాండ్‌కు రాలేదు. దీంతో అప్పటి లి‘నుంచి నేటి వరకు ప్రయాణికులు ఆదరణ కు నోచుకోలేక నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరింది. ప్రయాణికులు అక్కడికి వెళ్లకపోవడంతో అప్పటినుంచి ఇప్పటి వరకు బస్టాండ్ నిరుపయోగంగా మారింది. దీంతో కట్టంగూరు నుంచి నకిరేకల్, కేతేపల్లి, సూర్యాపేట తదితర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు కట్టంగూరు సెంటర్‌లో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్లపైనే బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు.
స్థలదాతల సహకారంతో
కట్టంగూరులో నిర్మించిన బస్టాండ్ కోసం కట్టంగూరుకు చెందిన కొందరు వ్యక్తులు సు మారు ఎకరం భూమిని జాతీయ రహదారిని ఆనుకొని బస్టాండ్ నిర్మాణం కోసం ఉచితంగా ఇ చ్చారు. కట్టంగూరుకు చెందిన కీర్తిశేషులు దివంగత రెడ్డిపల్లి బుచ్చయ్య 18 గుంటల భూమిని, కట్టంగూరుకు చెందిన నెర్మట్ల వెంకటేశ్వర్లు, కన్నెం భాగ్యమ్మ ఇద్దరు కలిసి 18 గుంటల స్థలా న్ని ఉచితంగా ప్రభుత్వానికి ఇచ్చారు. లక్షల రూ పాయలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్‌ను వెంట నే పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకరావాల ని కట్టంగూరు మండల ప్రజలు కోరుతున్నారు.
బస్టాండ్‌ను ఉపయోగంలోకి తీసుకురావాలి
ఆర్టీసీ అధికారులు చొరవ చూపి కట్టంగూరులో నిరుపయోగంగా ఉన్న బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకురావాలి. గత 25 సంవత్సరాల నుంచి ఆదరణకు నోచుకోకపోవడంతో బస్టాండ్ శిథిలావస్థకు చేరింది. బస్టాండ్‌కు మరమ్మత్తు చేయించి ఉపయోగంలోకి తీసుకవచ్చి ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను అందించాలి.
- రెడ్డిపల్లి వీరస్వామి, కట్టంగూరు
బస్టాండ్‌ను పునరుద్ధరిస్తున్నాం
నల్లగొండ జిల్లాలో నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్లను విడతల వారీగా పునరుద్ధరిస్తున్నాం. ఇటీవల కాలంలో సివిల్ ఇంజనీర్లతో సర్వే చేయించాం. డెవల్‌పమెంట్ నిధులతో కట్టంగూరు బస్టాండ్ కూడా పునరుద్ధరించి త్వరలోనే వినియోగంలోకి తీసుకువస్తాం.