Share News

‘జనజాతర’ సభను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:45 PM

హైదరాబాద్‌లోని తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్‌ పార్టీ జనజాతర బహిరంగ సభ ను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డి, మునిసిపల్‌ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

   ‘జనజాతర’ సభను విజయవంతం చేయాలి
నకిరేకల్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న వీరేశం

‘జనజాతర’ సభను విజయవంతం చేయాలి

నల్లగొండటౌన, నకిరేకల్‌, ఏప్రిల్‌ 5: హైదరాబాద్‌లోని తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్‌ పార్టీ జనజాతర బహిరంగ సభ ను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డి, మునిసిపల్‌ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శుక్రవా రం నకిరేకల్‌, నల్లగొండ పట్టణాల్లో నిర్వహించిన సమావేశాల్లో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ జన జాతర కార్యక్రమంలో రాహుల్‌గాంధీ పాల్గొని కాంగ్రెస్‌ పార్టీ చేపట్టబోయే అ భివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నిక ల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని 100రోజుల్లోపే అమలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కేం ద్రంలో అధికారంలోకి వచ్చి రాహుల్‌గాంధీ ప్రధాని అయితే దే శంలో ప్రజాస్వామ్యం నిలుస్తుందన్నారు. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల్లో కాం గ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. పార్టీ శ్రేణులంతా జన జాతర బహిరం గ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. వేసవిలో మండే ఎండలను దృష్టిలో ఉంచుకొని సమావేశానికి హాజరయ్యే కార్యకర్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆయా సమావేశాల్లో భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల నకిరేకల్‌ నియోజకవర్గ ఇనచార్జి వెంకటరమణ, బీసీ ఫైనాన్స కార్పొరేషన మాజీ చైర్మన పూజార్ల శంభయ్య, దైద రవీందర్‌, చామల శ్రీనివాస్‌, అల్గుబెల్లి రవీందర్‌రెడ్డి, చిట్యాల మునిసిపల్‌ చైర్మన కోమటిరెడ్డి చిన్న వెంకట్‌రెడ్డి, సమావేశంలో నల్లగొండ మునిసిపల్‌ వైస్‌చైర్మన అబ్బగోని రమే్‌షగౌడ్‌, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్ది సుమన, మార్కెట్‌ కమిటీ చైర్మన జూకురి రమేష్‌, డీ సీసీబీ డైరెక్టర్‌ పాశం సంపతరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్‌ పార్టీ నా యకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్‌, ఎనఎ్‌సయూఐ నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:45 PM