Share News

నైజాంను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదే

ABN , Publish Date - Sep 19 , 2024 | 12:35 AM

నైజాం నవాబును తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదేనని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గోదా శ్రీరాములు అన్నారు.

నైజాంను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదే
మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు

వలిగొండ, సెప్టెంబరు 18: నైజాం నవాబును తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదేనని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గోదా శ్రీరాములు అన్నారు. మండలంలోని వేములకొండలో మంగళవారం రాత్రి నిర్వ హించిన తెలంగాణ సాయుధ పోరాటాల వారోత్సవాల ముగింపు సభలో 1947 ఆగస్టు 15న దేశానికి స్వాత్యంత్రం సిద్ధించిననాటికి 500 సంస్థానాలు ఉండేవన్నారు. దాంట్లో హైదరాబాద్‌ సంస్థానం అతి పెద్దదని నైజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ సైనాధ్యోక్షులు ఖాషీం రజ్వీ, భూస్వామి విసునూరి రామచంద్రరెడ్డి జాగీదార్లు మీలటరీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పాలించేవారన్నారు. ప్రజలపై అనేక రకాల పన్నులు వసూలు చేస్తూ మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ కులాల వారిలో వెట్టిచాకిరి చేయిస్తూ నిరంకుశంగా వ్యవహరించేవారన్నారు. ఆ నిరంకుశ తత్వాన్ని చూసిన రావి నారాయణరెడ్డి, మోహినుద్ధీన్‌, బద్దం ఎల్లారెడ్డి, ఆంధ్ర మహాసభలో కాసీం ఆకృత్యాలపై పోరాటం చేయాలని నిర్ణయించారని, 1947 సెప్టెంబర్‌ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని గుర్తుచేశారు. అనంతరం స్వాతంత్య సామరయోధులను సన్మానించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, పులిపలుకుల ఆనందం, జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్‌, ఉప్పల ముత్యాలు, కళ్లం కృష్ణ్ణ, పోలేపాక యాదయ్య, జలగందుల అంజయ్య, పులిపలుకుల మల్లేశం, వీరస్వామి, మహేష్‌, వెంకటేశం, నర్సింహ, మహేందర్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 12:35 AM