Share News

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:39 AM

సాగునీటి సదుపాయం లేకపోవడం, అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి,

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

సీఎస్‌ శాంతికుమారికి బీఆర్‌ఎస్‌ నేతల వినతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): సాగునీటి సదుపాయం లేకపోవడం, అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్‌, పాడి కౌశిక్‌ రెడ్డి మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సీఎ్‌సను కోరారు. అనంతరం మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డి తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వ పక్షపాతవైఖరి, నీటి నిర్వహణలో అసమర్థత వల్లే రైతులు పంట నష్టపోయారని అన్నారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించాలని కోరారు.

Updated Date - Apr 03 , 2024 | 02:39 AM