Share News

సీకెంట్‌ పైల్స్‌ వినియోగించాలని సర్కారే చెప్పింది!

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:42 AM

అన్నారం బ్యారేజీ నిర్మాణంలో కటా్‌ఫల కోసం షీట్‌ పైల్స్‌ను వినియోగించాలని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) సిఫారసు చేస్తే.. సీకెంట్‌ పైల్స్‌ ఎందుకు వాడారని నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌ను

సీకెంట్‌ పైల్స్‌ వినియోగించాలని సర్కారే చెప్పింది!

అందుకే ‘అన్నారం’లో ఆ విధానం

ఎన్‌డీఎ్‌సఏకు తెలిపిన అఫ్కాన్స్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): అన్నారం బ్యారేజీ నిర్మాణంలో కటా్‌ఫల కోసం షీట్‌ పైల్స్‌ను వినియోగించాలని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) సిఫారసు చేస్తే.. సీకెంట్‌ పైల్స్‌ ఎందుకు వాడారని నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌ను జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) ప్రశ్నించింది. బ్యారేజీ నిర్మాణంపై ఎన్‌డీఎ్‌సఏ 33 ప్రశ్నలు సంధించగా.. అఫ్కాన్స్‌ వాటికి బదులిచ్చింది. సీకెంట్‌ పైల్స్‌ వినియోగించాలని తెలంగాణ నీటి పారుదలశాఖ 2017 ఫిబ్రవరి 4న లేఖ రాసిందని తెలిపింది. అందువల్లే ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు స్పష్టం చేసింది. గేట్లు కాకుండా బ్యారేజీ పనులు 2018 సెప్టెంబరులోనే పూర్తయ్యాయని, 2019 గేట్ల పనులు పూర్తికాగా.. 2019 జూలై 21న గేట్లను మూసివేసి, నీటిని నిల్వ చేశామని, అయితే గేట్లు మూసిన తర్వాత ఎలాంటి లీకేజీలను గుర్తించలేదని గుర్తు చేసింది. 2019 వరదల సమయంలో గేట్లను కొద్దిగా ఎత్తడం జరిగిందని, నీటి ప్రవాహానికి బ్యారేజీ దిగువ భాగంలో ఉన్న రక్షణ పనులు కొట్టుకుపోయాయని, 2019 వరదల తర్వాత ఇదే పరిస్థితి దిగువ భాగంలో ఉందని తెలిపింది. బ్లాకుల వారీగా నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్‌ అందించాలని కోరగా.. అది తయారు చేయలేదని అఫ్కాన్స్‌ వెల్లడించింది. బ్యారేజీ నిర్మాణం చేపట్టిన తీరును వివరించాలని కోరగా.. 2016 నవంబరులో నిర్మాణ పనులను కుడివైపు నుంచి ప్రారంభించామని తెలిపింది. బ్యారేజీ దిగువ/ఎగువ భాగంలో రక్షణ పనులు పూర్తయ్యేదాకా డీ వాటరింగ్‌ చేశామని, పునాది దశకు చేరిన తర్వాత ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఉమాశంకర్‌ పర్యవేక్షణలో వైబ్రోమాక్స్‌ అండ్‌ ప్లేట్‌ లోడ్‌ టెస్ట్‌ను బ్లాక్‌నం.5కు చే శామని, ఆ తర్వాత ఇతర బ్లాకుల్లో కూడా చేశామని వివరించింది. ప్రతి కాంపొనెంట్‌ పూర్తికి సంబంధించిన నివేదికలు అందించాలని కోరగా.. ఆ నివేదికలు లేదని, పనులు పూర్తయినట్లు ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్‌ను పొందుపరిచామని నివేదించింది. బ్యారేజీ గేట్లను ఎత్తే క్రమంలో సీసీ బ్లాకులు చెల్లాచెదురు కావడంతో పాటు ప్రవాహ వేగానికి బ్లాకుల్లో లోతైన రంధ్రాలను గుర్తించామని, దీనివల్ల సీకెంట్‌ పైల్స్‌ దెబ్బతిని సీపేజీ జరిగినట్లు వివరించింది. కొన్నిచోట్ల సీపేజీని కట్టడి చేయడానికి గ్రౌటింగ్‌ చేశామంది. బ్యారేజీని కాపాడుకోవడానికి ఏయే చర్యలు తీసుకోవాలో చెప్పాలని ఎన్‌డీఎ్‌సఏ కోరగా.. డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానల్‌ చైర్మన్‌ ఏబీ పాండ్యా నివేదిక ప్రకారం శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు పనులు చేసేదాకా వానాకాలానికి ముందు మోడల్‌ స్టడీస్‌ చేయాలని అఫ్కాన్స్‌ తెలిపింది. బ్యారేజీ గేట్లన్నీ తెరిచి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేయాలని, బ్యారేజీ దిగువభాగంలో ఏర్పడిన రంధ్రాలకు తగు మరమ్మతులు చేపట్టాలని వివరించింది.

Updated Date - Apr 03 , 2024 | 02:42 AM