Share News

యువత చేతుల్లోనే దేశ భవిత : జడ్పీ సీఈవో

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:47 PM

యువత చేతుల్లోనే దేశ భవిత ఉందని జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు.

యువత చేతుల్లోనే దేశ భవిత : జడ్పీ సీఈవో
సదస్సులో మాట్లాడుతున్న జడ్పీ ిసీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి

మిర్యాలగూడ, మార్చి 28: యువత చేతుల్లోనే దేశ భవిత ఉందని జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మీనా ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం జరిగిన ఓటరు చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజల చేతిలో ఓటు వజ్రాయుధం లాంటిందన్నారు. దానిని సద్వినియోగం చేసుకుని మంచి నేతలను ఎన్నుకుని ప్రజాస్వామ్యాన్ని ఫరిడవిల్లేల్లా చూడాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాల న్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతాలకు అతీతంగా యువతీ యువకులు తమ ఓటును వినియో గించుకొని, తమ కుటుంబసభ్యులు కూడా ఓటు వేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. భారత ఎన్నికల సంఘం పౌరులకు కల్పించిన వివిధ రకాలైన యాపులను వినియోగించుకుని ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత అంబాసిడర్స్‌గా యువత పైనే ఉుందన్నారు. కార్యక్రమంలో సీవీప్‌ జిల్లా నోడల్‌ అధికారి, డీఎల్‌పీవో రాఘవరావు, మాస్టర్‌ శిక్షకులు గుడిపాటి కోటయ్య, అంబటి శ్రీనివాస్‌, వెంకట్‌రెడ్డి, డివిజనల్‌ పంచాయతీ అఽధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:47 PM