Share News

స్వాతంత్య్ర సమరయోధురాలు పరిపూర్ణ కన్నుమూత

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:26 AM

స్వాతంత్య్ర సమరయోధురాలు, తొలితరం వామపక్ష విద్యార్థి సంఘం నాయకురాలు, రచయిత్రి నంబూరి పరిపూర్ణ(92) ఇకలేరు. బెంగుళూరులోని పెద్దకుమారుడి వద్ద ఉంటున్న ఆమె శుక్రవారం రాత్రి చనిపోయారు.

స్వాతంత్య్ర సమరయోధురాలు పరిపూర్ణ కన్నుమూత

‘భక్తప్రహ్లాద’ సినిమాలో బాల ప్రహ్లాద పాత్రధారణ

హైదరాబాద్‌ సిటీ, జనవరి27(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధురాలు, తొలితరం వామపక్ష విద్యార్థి సంఘం నాయకురాలు, రచయిత్రి నంబూరి పరిపూర్ణ(92) ఇకలేరు. బెంగుళూరులోని పెద్దకుమారుడి వద్ద ఉంటున్న ఆమె శుక్రవారం రాత్రి చనిపోయారు. పరిపూర్ణ జీవిత సహచరుడు దివంగత భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నాయకుడు దాసరి నాగభూషణరావు. పరిపూర్ణ ఏడవ ఏట నుంచే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాట సభలు, సమావేశాలలో దేశభక్తిగీతాలు ఆలపించారు. బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా కృష్ణాజిల్లా కేంద్రంగా సాగిన ‘ఆకలి యాత్రలు’ లాంటి నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించారు. జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలోనూ క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. చిన్నతనం నుంచి సంగీత, నాటక రంగాలలో అభినివేశం కలిగిన పరిపూర్ణ 1941నాటి ‘భక్తప్రహ్లాద’ సినిమాలో బాల ప్రహ్లాద పాత్రలో నటించారు. మద్రాసు రేడియో బాలగాయనిగా అనేక దేశభక్తి పాటలు ఆలపించారు.

Updated Date - Jan 28 , 2024 | 11:37 AM