Share News

సమరయోధుల పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:11 PM

సమరయోధుల పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియ జేయడం మనందరి బాధ్యతని జిల్లా కలెక్టర్‌ శశాంక అన్నారు. మంగళవారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సమరయోధుల పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలి
గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

మహాత్మాగాంధీ వర్ధంతిలో కలెక్టర్‌ శశాంక

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 30 : సమరయోధుల పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియ జేయడం మనందరి బాధ్యతని జిల్లా కలెక్టర్‌ శశాంక అన్నారు. మంగళవారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే ఽధ్రుడ సంకల్పంతో, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాటంలో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని, వారి త్యాగాల ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్‌ సిబ్బంది, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మహాత్ముడికి నివాళి

వికారాబాద్‌, జనవరి 30 : మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం వికారాబాద్‌ జడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ బైండ్ల విజయకుమార్‌, సీఈవో జానకీరెర్‌,, జడ్పీటీసీ రాందాస్‌ పాల్గొన్నారు.

మహాత్ములను స్మరించుకోవడం మన భాద్యత

కీసర : మహాత్ములను స్మరించుకోవడం మనందరి బాధ్యతని మేడ్చల్‌ డీఆర్‌వో హరిప్రియ అన్నారు. మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా మంగళవారం మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ అమర వీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు అమరులకు నివాళులర్పించారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే సంకల్పంతో అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Updated Date - Jan 30 , 2024 | 11:11 PM