పండుగ సాయన్నకు ఘన నివాళి
ABN , Publish Date - Jul 17 , 2024 | 11:10 PM
బహుజన వీరుడు పండుగ సాయన్న అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీని వాస్‌రెడ్డి అన్నారు
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
పాలమూరు, జూలై 17 : బహుజన వీరుడు పండుగ సాయన్న అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీని వాస్‌రెడ్డి అన్నారు. బుధవారం పండుగ సాయన్న 133వ జయంతి సందర్భంగా పట్టణంలోని గ్రీన్‌బెల్ట్ ప్రాంతంలో ఆయన విగ్రహానికి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి పూలమాలవేసి నివాళి అర్పించారు. తెలంగాణ చౌరస్తాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్‌గౌడ్, ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదు ల్లా కొత్వాల్, బాలయ్య, సంజీవ్ ముదిరాజు, వినోద్‌కుమార్, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, సత్తూరు చంద్రకుమార్‌గౌడ్, సిరాజ్‌ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్, కృష్ణయ్య పాల్గొన్నారు.
పండుగ సాయన్న చరిత్రను రాష్ట్ర వ్యాప్తం చేసినం
- ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పండుగ సాయన్న చరిత్రను రాష్ట్ర వ్యాప్తం చేశామని ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం పండుగ సాయన్న 133 జయంతి సందర్శంగా జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పండుగ సాయన్న వారసులను ఆన్ని విధాలుగా ఆదుకున్నామని వివరించారు. అనంతరం వీరన్నపేటలో ఆయన సమాధివద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ కె.సీ నరసింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజు, కౌన్సిలర్లు టి.గణేష్, కట్టా రవికిషన్‌రెడ్డి, నాయకులు నవకాంత్, సుధాకర్, మల్లేష్, సత్యం, కిషన్ పవార్ పాల్గొన్నారు.
పండుగ సాయన్న చిరస్మరణీయుడు : సంజీవ్ ముదిరాజ్
పేదలకోసం పనిచేసిన పండుగ సాయన్న చిరస్మరణీయుడని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ముదిరాజు, బీసీల నాయకులు అన్నారు. పండుగ సాయన్న జయంతి సందర్భంగ బుధవారం వీరన్నపేటలోని ఆయన సమాధి వ ద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకు లు శివన్న, కృష్ణముదిరాజ్, జంగయ్య, పద్మ నరే ష్,పవన్‌కుమార్, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
ఫ గండీడ్ : మండల కేంద్రంలో పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బోయిని గోపాల్ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ముదిరాజ్ సంఘ ఉపాధ్యక్షులు గిరిమోని అంజి లయ్య, వెంకటయ్య, ఆంజనే యులు, ప్రధాన కార్యదర్శి కేశవులు, మాజీ ఎంపీటీసీ బాలయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచు హన్మం తు, సలహాదారుడు నర్సప్ప, వెన్నాచేడ్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కె.నర్సిం ములు, డీఎస్‌పీ అధ్యక్షుడు పసుల శ్రీను, ఆనంద్, రఘు, ఆయా గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, ముదిరాజ్, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
పెత్తందారి వ్యవస్థను రూపుమాపిన ధీశాలి
పాలమూరు : పెత్తందారి వ్యవస్థను రూపుమాపిన ధీశాలి పండుగ సాయన్న అని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి యం.శ్రీనివాస్ అన్నారు. బుధవారం పండుగ సాయన్న జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆశన్న, పద్మశాలి నాయకులు సారంగి లక్ష్మీకాంత్, జాండ్రసంఘం నాయకులు మహేందర్, సవారి సత్యం, యాంకి రమేష్ పాల్గొన్నారు.
పండుగ సాయన్న ఆదర్శ ప్రాయుడు
నవాబ్‌పేట : బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పండుగ సాయన్న ఆదర్శ ప్రాయుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ మండల నాయకులు భూపాల్ రెడ్డి, పోమాల లింగం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. మండలంలోని మరి కల్ గ్రామంలో బీసీ నాయకులు పిట్టల నర్సింహులు ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో పుట్టి ఆంజనేయులు, కోట్ల రాజేష్, శిర్ప సత్యం, శివకుమార్, పాండు పాల్గొన్నారు.