Share News

జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:14 PM

పాఠశాల ల్లో నెలకొన్న సమస్యలను తాను పరిష్క రిస్తానని, మీరు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు.

జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి
విద్యార్థులకు మెటీరియల్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి

- పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీలో ఎమ్మెల్యే యెన్నం

హన్వాడ, ఫిబ్రవరి 7 : పాఠశాల ల్లో నెలకొన్న సమస్యలను తాను పరిష్క రిస్తానని, మీరు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. బుధవారం హన్వాడ, వేపూర్‌ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గొండ్యాల పాఠశాలలో ఏర్పాటు చేసిన టీఎల్‌ఎం మేళాను ప్రారంభించారు. హన్వాడ పాఠశాల ఆవరణలో విద్యార్థుల దాహార్తిని తీర్చడానికి బోరు మోటార్‌ డీఈవో, హెచ్‌ఎంతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో స్పెషల్‌ అధికారి యాదయ్య, జిల్లా విద్యాధికారి రవీందర్‌, ఎంపీపీ బాలరాజు, తహసీల్దార్‌ కిష్టానాయక్‌, ఎంపీడీవో ధనుంజయ్‌ గౌడ్‌, జడ్పీటీసీ విజయ నిర్మల, జడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ అన్వర్‌, ఎంఈవో రాజు నాయక్‌, సెక్టోరియల్‌ అధికారి బాలుయాదవ్‌, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

పాలమూరు : బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్‌ మండ లానికి చెందిన 45మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేసి ప్రసంగించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలలో రెండు అమలు చేస్తున్నామని త్వ రలో మరో రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం గా ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఫయీ మ్‌, అర్బన్‌ తహసీల్దార్‌ రాధాకృష్ణ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజ్మత్‌అలీ, ఆర్‌ఐ చైతన్య, ఎన్‌ఎస్‌యూఐ ఆవేజ్‌, శివప్రసాద్‌, శ్రీనివాసులు, మునీర్‌, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

ఫతేపూర్‌లో బోరు మోటార్‌ ప్రారంభం

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : మండలంలోని ఫతేపూర్‌ గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్‌, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బోరుమోటారును ప్రారంభించారు. గ్రామస్థులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. మాజీ సర్పంచ్‌ పండరీనాథ్‌, కృష్ణాజీ, ఫారుఖ్‌, నర్సింహులు, చెన్నయ్య, మల్లు నర్సింహారెడ్డి, నరేష్‌గౌడ్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:14 PM