Share News

మాజీ సర్పంచ కన్నీలాల్‌ మృతి బాధాకరం

ABN , Publish Date - May 20 , 2024 | 11:33 PM

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రమావత రవీంద్రకుమార్‌ తండ్రి, రత్యతండా మాజీ సర్పంచ కనిలాల్‌ మృతి బాధాకరమని మాజీ మంత్రి టి.హరీ్‌షరావు అన్నారు.

 మాజీ సర్పంచ కన్నీలాల్‌ మృతి బాధాకరం
కన్నీలాల్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న హరీష్‌రావు, నాయకులు

మాజీ సర్పంచ కన్నీలాల్‌ మృతి బాధాకరం

నివాళులర్పించిన మాజీ మంత్రి హరీ్‌షరావు

దేవరకొండ, మే 20: బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రమావత రవీంద్రకుమార్‌ తండ్రి, రత్యతండా మాజీ సర్పంచ కనిలాల్‌ మృతి బాధాకరమని మాజీ మంత్రి టి.హరీ్‌షరావు అన్నారు. దే వరకొండలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కన్నీలాల్‌ చి త్రపటానికి సోమవారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కన్నీలాల్‌ కుమారుడైన రవీంద్రకుమార్‌ కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా హరీ్‌షరావు మాట్లాడుతూ కన్నీలాల్‌ రత్యతండా సర్పంచగా ఏకగ్రీవంగా ఎ న్నికై గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. కన్నీలాల్‌ మృతికి సంతాపం తెలిపిన వారిలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌, జడ్పీ చైర్మన బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత, కంచర్ల భూపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, నాయకులు రాంబాబునాయక్‌, ఆంజనేయులు, లింగారెడ్డి, రాజు, కృష్ణ పాల్గొన్నారు.

హరీ్‌షరావుకు ఘన స్వాగతం

కొండమల్లేపల్లి: మాజీ మంత్రి హరీ్‌షరావు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు దేవరకొండకు వెళ్తూ మార్గమధ్యలో కొండమల్లేపల్లి మండలంలోని కేసీఆర్‌ తండాలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా అక్కడి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని అన్నారు. అనంతరం దేవరకొండకు బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట నాయకులు కేసాని లింగారెడ్డి, రావుల వెంకట య్య, దస్రూనాయక్‌, తులసీరాం తదితరులు ఉన్నారు.

నేడు తన్నీలాల్‌ సంతాప సభకు కేటీఆర్‌ రాక

దేవకొండ: దేవరకొండ పట్టణంలోని సాయిరమణ ఫంక్షన హాల్‌లో మంగళవారం నిర్వహించే మాజీ ఎమ్యెల్యే రవీంద్రకు మార్‌ తండ్రి కన్నీలాల్‌ సంతాభ సభకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రె సిడెంట్‌ కేటీఆర్‌ హాజరుకానున్నట్లు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు గాజుల ఆంజనేయులు తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.

Updated Date - May 20 , 2024 | 11:33 PM