Share News

కుళ్లిన స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతదేహం లభ్యం

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:36 AM

నాగోల్‌ పీఎస్‌ పరిధిలో అద్దె ఇంట్లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతదేహం కుళ్లిపోయిన స్థితి లో లభ్యమైంది.

కుళ్లిన స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతదేహం లభ్యం

కుళ్లిన స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతదేహం లభ్యం

కొత్తపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): నాగోల్‌ పీఎస్‌ పరిధిలో అద్దె ఇంట్లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతదేహం కుళ్లిపోయిన స్థితి లో లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా తిప్పర్తికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తెరతేపల్లి నరేష్‌ (35) సాయినగర్‌ రోడ్‌ నెం 4లో ఎస్‌కే మూర్తికి చెందిన ఇంట్లో రెండు నెలల నుంచి అద్దెకు ఉంటున్నా డు. అతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య ప్రసవానికి మిర్యాలగూడకు వెళ్లిందని, తాను ఇంటి వద్ద నుండే పనిచేస్తానని నరేష్‌ ఇంటి యజమానికి చెప్పాడు. అతడు హైబీపీతో సతమతమవుతున్నట్లు తెలిసింది. అతడు ఇంట్లో పని అవసరం ఉన్నప్పుడు పనిమనిషికి ఫోన్‌చేసి చెప్పేవాడు. బుధవారం పనిమనిషి అతడి ఇంట్లో పనిచేసి వెళ్లింది. గురువారం నుంచి అతడు పనిమనిషికి ఫోన్‌ చేయలేదని తెలిసింది. ఆదివారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని మూర్తి 100కు డయల్‌ చేసి సమాచారం ఇచ్చారు. నాగోల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. నరేష్‌ మృతదేహం బోర్లా పడి కుళ్లిన స్థితిలో కనిపించింది. పోలీసులు అతడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి తెరతేపల్లి రమే్‌షకు సమాచారం ఇచ్చారు. రమేష్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:36 AM