బలహీన వర్గాలే అభ్యున్నతే సీపీఐ లక్ష్యం
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:21 PM
బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థిక, సామా జిక అభివృద్ధి సాధించడమే సీపీఐ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వార్ల వెంకటయ్య అన్నారు.

తాడూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థిక, సామా జిక అభివృద్ధి సాధించడమే సీపీఐ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వార్ల వెంకటయ్య అన్నారు. ఆదివారం మండ లంలోని గుంత కోడూరు గ్రామంలో సీపీఐ శ తాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామం లో జెండా ఆవిష్కరణ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. రైతుల హక్కులను కాపాడే విషయంలో క మ్యూనిస్టులు ఎప్పుడూముందు వరుసలో ఉం టారన్నారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చి న హామీలు అమలయ్యేలా ప్రభుత్వాలు చొర వ చూపాలని తెలిపారు. కార్యక్రమంలో స్థాని కసీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.