Share News

ఆ సవరణలతో సహకార రంగం నిర్వీర్యం

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:38 AM

కేంద్ర ప్రభుత్వం సహకార రంగంలో తీసుకొచ్చిన చట్ట సవరణలు వాటి మౌలిక స్వభావమేమార్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను

ఆ సవరణలతో సహకార రంగం నిర్వీర్యం

సహకార ధర్మ పీఠం వ్యవస్థాపకుడు భూమయ్య

కేంద్ర ప్రభుత్వం సహకార రంగంలో తీసుకొచ్చిన చట్ట సవరణలు వాటి మౌలిక స్వభావమేమార్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా ఉన్నాయని సహకార ధర్మ పీఠం వ్యవస్థాపకుడు సంభారపు భూమయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సవరణలపై ప్రజలను చైతన్యపరిచేందుకు, కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్న సెక్షన్లను ఉపసంహరించుకునేందుకు 2023 డిసెంబరు 28 నుంచి 2024 మార్చి 24 వరకు సహకార్‌ ధర్మ్‌ రక్షక్‌ మహాభారత్‌ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలో 60 శాతం ప్రజల స్వతంత్ర ఆర్థిక వ్యవస్థకు మూలమైన సహకార సంస్థలు కేంద్రం చేసిన సవరణల వల్ల ప్రైవేటు రంగం పాలయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jan 30 , 2024 | 10:12 AM