బక్క జడ్సన్‌పై వేటు
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:55 AM
టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌పై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను ఆయన్ను ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ప్రకటించారు. బహిరంగ వేదికల మీద

ఆరేళ్ల పాటు బహిష్కరించిన కాంగ్రెస్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌పై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను ఆయన్ను ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ప్రకటించారు. బహిరంగ వేదికల మీద పార్టీ విధానాలను, కార్యక్రమాలను తప్పు పట్టినందుకు, పార్టీ నాయకత్వం, సీఎం రేవంత్‌పై విమర్శలు చేసినందుకుగాను బహిష్కరణ వేటు వేసినట్లు తెలిపారు. దీనిపై వివరణ కోరుతూ మార్చి 27నే జడ్సన్‌కు క్రమశిక్షణ చర్యల కమిటీ.. షోకాజ్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకుంటే పార్టీ నియమావళిని అనుసరించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆయన వివరణ ఇవ్వక పోవడంతో బహిష్కరణ వేటు వేసింది. మార్చి 30 నుంచి బహిష్కరణ అమలు కాను న్నట్లు చిన్నారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బహిష్కరణ వేటుపై జడ్సన్ స్పందిస్తూ.. చివరికి తనకు గుర్తింపు దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో 1989 నుంచి కొనసాగుతున్న తన ప్రస్థానానికి మద్దతుగా నిలిచిన ఏఐసీసీకి, రాహుల్, ప్రియాంక గాంధీలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను తినేస్తున్న వారి చేతుల్లో తెలంగాణ కాంగ్రె్‌సను పెట్టారంటూ ఎక్స్ వేదికగా స్పందించారు.