సీఎం సభను జయప్రదం చేయాలి
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:31 PM
ఈ నెల 30న మహబూబ్‌నగన్ సమీపాన ఉన్న జమిస్తాపూర్‌లో నిర్వహించే రైతు పం డగ, సీఎం సభను విజయవంతం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి పిలు పునిచ్చారు.

- రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కశిరెడ్డి
కల్వకుర్తి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 30న మహబూబ్‌నగన్ సమీపాన ఉన్న జమిస్తాపూర్‌లో నిర్వహించే రైతు పం డగ, సీఎం సభను విజయవంతం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి పిలు పునిచ్చారు. రైతులను రాజులను చేయడమే సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభు త్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడారు. కల్వకుర్తి ప్రాంత వాసి సీఎం రేవంత్‌రెడ్డి రైతుల సంక్షే మం కోసం అహర్నిషలు పని చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న రైతు పండుగలో శాస్త్రవేత్తలచే రైతు లకు వ్యవసాయంపై మరింత మెళకు వలు చెప్పిస్తున్నట్లు తెలిపారు. కల్వ కుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యా దవ్ తమపై చేస్తున్న విమర్శలను మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. విలేకర్ల సమావేశంలో కల్వకుర్తి మాజీ సర్పం చ్ బృంగి ఆనంద్‌కుమార్, వెల్దండ మాజీ స ర్పంచ్ ఎన్నం భూపతిరెడ్డి, నాయకులు విజ య్ కుమార్‌రెడ్డి, జగన్, శ్రీకాంత్‌రెడ్డి, సంజీవ్ యాదవ్, శ్రీకాంత్, హనుమానాయక్, రాంరెడ్డి, రాజశేఖర్, కౌన్సిలర్లు ఎజాజ్, శేఖర్, రవి, బాలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట : ఎమ్మెల్యే
వెల్దండ : రాష్ట్రంలోని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అత్యంతప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మండల పరిధిలోని పెద్దాపూర్‌కు చెందిన వరికుప్పల మంగమ్మకు మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.60వేల చెక్కును గురువారం బాధిత కుటుంబీకులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమళ్ల కృష్ణ, నాయకులు ఆంజనేయులు, అనిల్‌కుమార్, కొండల్, శ్రీనినాయక్ తదితరులు ఉన్నారు.