Share News

ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:11 AM

జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రప్రభుత్వ ప్రయత్నిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొం డ కాంతయ్య అన్నారు.

 ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
సమావేశంలో మాట్లాడుతున్న కాంతయ్య

ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొం డ కాంతయ్య

నల్లగొండరూరల్‌, ఫిబ్రవరి 29: జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రప్రభుత్వ ప్రయత్నిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొం డ కాంతయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ముగ్దుం భవనంలో గురువారం నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పని జరిగే ప్రాంతంలో రెండుసా ర్లు ఫొటో విధానాన్ని ఉపసంహరించుకోవాలని, ఆధార్‌ సీడింగ్‌, వేతనాల ఆలస్యం తదితర సమస్యలను పరిష్కరించాలని ఆ యన డిమాండ్‌ చేశారు. భారతదేశంలో 25.89 కోట్ల మందికి ఉ పాధి హామీ జాబ్‌కార్డులు ఉన్నాయని, కేవలం 13 కోట్ల 48 లక్ష ల మంది మాత్రమే ఆధార్‌కు, బ్యాంకు లింకు చేసుకున్నారని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో 80 లక్షల 23వేల 310 మంది జాబ్‌కార్డులు ఉండగా కేవలం 18 లక్షల 435 మందికి మాత్రమే బ్యాంకు అనుసంధానం చేయించుకున్నారని అన్నారు. మిగిలిన వారు కేవైసీ కాక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నా రు. ఇప్పటికైనా ఆధార్‌ లింక్‌ లేకుండా కూలీలు అందించాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. లొడంగి శ్రావణ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు చెడుబుద్ధి ఉష, వేముల బుచ్చయ్య, కార్యవర్గ స భ్యులు కాగిత వెంకన్న, శంకర్‌నాయక్‌, ఇరిగి సంజీవ, వెంపటి శ్రీనివాస్‌, అమరసింగ్‌, ఎన.సైదులు, బి.సైదులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:11 AM