Share News

ఆరంభం..అదుర్స్‌

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:21 PM

తొలకరి వర్షాలు పాలమూరు అన్నదాతను మురిపిస్తున్నాయి. సీజ న్‌ ప్రారంభం నుంచి క్రమం తప్పకుండా వానలు పడుతున్నాయి.

ఆరంభం..అదుర్స్‌
మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో కురుస్తున్న వాన

- పాలమూరులో మంచి వర్షాలు

- 16 మండలాల్లో సాధారణం కన్నా అధికం

- ఇప్పటివరకు సగటున జిల్లాలో

67.4 మిల్లీమీటర్ల వర్షపాతం

మహబూబ్‌నగర్‌, జూన్‌ 10: తొలకరి వర్షాలు పాలమూరు అన్నదాతను మురిపిస్తున్నాయి. సీజ న్‌ ప్రారంభం నుంచి క్రమం తప్పకుండా వానలు పడుతున్నాయి. ఆరంభం ఆశాజనకంగా ఉండ టంతో వ్యవసాయ పనులు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వి త్తనాలు పడిపోవడం, అవి మొలకెత్తాయి. జిల్లా లోని అన్ని మండలాల్లో పెద్దఎత్తున వానలు కు రుస్తున్నాయి. 16 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురవగా ఒక మండలంలో మాత్రం సాధారణ వర్షపాతం న మోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకు సగటున 22.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 67.4 మీ.మీ. వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కన్నా 203.4 శా తం అధిక వర్షం కురిసింది. అందుకే జిల్లా అం తగా రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నా రు. జొన్న, పత్తి విత్తనాలు వేస్తుండగా, వరికి నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. మరో మూ డు, నాలుగు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురు స్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే జిల్లాను ఆరెంజ్‌ జోన్‌గా ప్రకటించింది. సీసీకుంటలో ఇప్ప టి వరకు 22 మీ.మీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 88.2 మీ.మీ, కోయిలకొండలో 22.8మీ.మీ., 82.5 మీ.మీ., గండీడ్‌లో 21.9 మీ.మీటర్లకు 76.7మీ.మీ., హన్వాడలో 25.5మీ.మీటర్లకు 52.9 మీ.మీ., మహబూబ్‌నగర్‌ రూరల్‌లో 23.8 మీ.మీ టర్లకు గాను 56.6మీ.మీ, దేవరకద్రలో 23.3మీ.మీ. కు 85.5మీ.మీ., అడ్డాకులలో 23.2 మీ.మీటర్లకు 58.7 మీ.మీ., మూసాపేటలో 22 మీ.మీటర్లకు 39 మీ.మీ., భూత్‌పూర్‌లో 24.1మీ.మీటర్లకు 59.9 మీ. మీ., మహ బూబ్‌నగర్‌ అర్బన్‌లో 27.9 మీ. మీట ర్లకు 105.2 మీ.మీ., నవాబ్‌పేటలో 23.3 మీ.మీట ర్లకు 80.2మీ.మీ., బాలానగర్‌లో 21.1 మీ.మీట ర్లకు 42.7 మీ.మీ., రాజాపూర్‌లో 20.2 మీ.మీట ర్లకు 98.5 మీ.మీ., మిడ్జిల్‌లో 20.8 మీ.మీటర్లకు 70.1 మీ.మీ., మహ్మదాబాద్‌లో 10.8 మీ.మీటర్లకు 54.6 మీ.మీ., కౌకుంట్లలో 25.8 మీ.మీ., వర్ష పాతానికి గాను 71.6 మీ.మీ., వర్షపా తం నమోదైంది. ఇక జిల్లాలో జడ్చర్లలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక్కడ 24.5 మీ.మీటర్లకు గాను 23.1 మీ.మీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - Jun 10 , 2024 | 11:21 PM