Share News

పేదింటి ఆడపడుచులను ఆదుకోవడమే లక్ష్యం

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:01 AM

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా పేదింటి ఆడపడుచులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

పేదింటి ఆడపడుచులను ఆదుకోవడమే లక్ష్యం
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, జూన్‌ 11: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా పేదింటి ఆడపడుచులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. అడవిదేవులపల్లి, మిర్యాలగూడ మండలాల పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజే శారు. ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బం దులు కలగకుండా ఈ పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభు త్వం త్వరలోనే ఆనే గ్యారెంటీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్నారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీ లోపు రైతు రుణమాఫీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొదిలి శ్రీనివాస్‌, తలకొప్పుల సైదులు, మిర్యాలగూడ అడవిదేవులపల్లి తహసీల్దార్‌లు హరిబాబు, సురేష్‌, ఆర్‌ఐలు రామ కృష్ణ, సత్యనారాయణ కౌన్సిలర్లు గంధం రామకృష్ణ, నాయకులు గుం డ్రెడ్డి బుచ్చిరెడ్డి, మంద సైదులు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:01 AM