Share News

అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

ABN , Publish Date - May 16 , 2024 | 11:18 PM

సమాజ మార్పు కోసం పని చేసే వారే క మ్యూనిస్టులని, అవినీతి రహిత సమాజ నిర్మాణమే కమ్యూనిస్టు ల లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నా రు.

 అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
అంజిరెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తమ్మినేని వీరభద్రం

అవినీతి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

తిప్పర్తి, మే 16: సమాజ మార్పు కోసం పని చేసే వారే క మ్యూనిస్టులని, అవినీతి రహిత సమాజ నిర్మాణమే కమ్యూనిస్టు ల లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నా రు. తిప్పర్తి మండల పరిధిలోని అంతయ్యగూడెం గ్రామంలో గు రువారం నిర్వహించిన సీపీఎం సీనియర్‌ నాయకుడు నన్నూరి అంజిరెడ్డి సంతాప సభకు ఆయన హాజరై మాట్లాడారు. నిరంత రం పేదల హక్కుల కోసం పోరాడిన అంజిరెడ్డి మృతి ప్రజా ఉ ద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు. వారి ఆశయాలు నేటి యువతరానికి మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, వారు మానవ సమాజాని కి కూడు, గూడు, ఉపాధి, ఉచిత విద్య, వైద్య సదుపాయాలను అందజేయడం కోసం పని చేస్తున్నట్లు తెలిపారు. దేశ రాజకీయాల్లో బడా కంపెనీల అధినేతలు చొరబడి రాజకీయాలను క లుషితం చేశారని ఆరోపించారు. తన జీవితమంతా ప్రజా ఉద్యమాల కోసం పని చేసి మరణాంతరం తన మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులు మెడికల్‌ కళాశాల వైద్య విద్యకు ఉపయోగప డే విధంగా అందజేయడం అభినందనీయమని అన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ నన్నూరి అంజిరెడ్డి తన ఇంటిని సీపీఎం కార్యాలయంగా మార్చి పేదలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఉద్యమాల ద్వారా ఎంతోమందిని సీపీఎం నాయకులుగా తీర్చిదిద్దడం అభినందనీయమ ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ము దిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు బొంతల చంద్రారెడ్డి, తుమ్మల వీరారెడ్డి, శ్రీశైలం, సయ్యద్‌ హాషం, పాలడుగు నాగార్జున, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు ప్రభావతి, ఊట్కూరి నారాయణరెడ్డి, ఎండీ సలీం, గంజి మురళీదర్‌, దండెంపల్లి సత్తయ్య, కు మారుడు వెంకటరమణారెడ్డి, కీర్తి, సువర్ణ, నన్నూరి కౌసల్యమ్మ, మండల నాయకులు బీరెడ్డి సీతారాంరెడ్డి, బీమగాని గణేష్‌, ఆ కిటి లింగయ్య, శశిధర్‌, వెంకన్న, శ్రీనివాసులు, యాదగిరి, రా ములు, శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 11:19 PM