Share News

పాఠశాలల ప్రారంభంలోపే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు

ABN , Publish Date - May 24 , 2024 | 11:48 PM

నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, ఏ కరూప దుస్తులు అందించనున్నట్లు మండల విద్యాధికారి తరి రాము అన్నారు.

 పాఠశాలల ప్రారంభంలోపే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు
గుర్రంపోడులో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్న ఎంఈవో రాము

పాఠశాలల ప్రారంభంలోపే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు

గుర్రంపోడు, మే 24: నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, ఏ కరూప దుస్తులు అందించనున్నట్లు మండల విద్యాధికారి తరి రాము అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో శుక్రవారం హెచఎంలకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమై న విద్యతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తువులు అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్ర భుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. మండల కేంద్రంలో కుట్టు మిషన కేంద్రాలను ఏర్పాటు చేసి త్వరితగతిన ఏకరూప దుస్తులు సిద్ధం చేసేలా ఏపీఎం, సమభావన సంఘం మహిళ లు చొరవ చూపడంపై ఆయన వారిని అభినందించారు. కార్యక్రమంలో హెచఎం నోముల యాదగిరి, అయిటిపాముల యాదగి రి, శ్రీనివాస్‌, పీఈటీ నాగేశ్వర్‌రావు, సీఆర్పీలు యాదగిరి, రమేష్‌, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ ఇటికాల రమేష్‌, యాదయ్య పాల్గొన్నారు.

కనగల్‌: మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ కొనసాగుతుంది. మండలకేంద్రంలోని ఎమ్మా ర్సీ భవనంలో పాఠశాలల హెచఎంలకు పుస్తకాలను ఎంఈవో రాములు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కు పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాంలను సకాలంలో అందించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రఫీ, శ్రీలత. ప్రవీణ్‌, వేణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 11:48 PM