Share News

టెట్‌ ఫీజు తగ్గించాలి: ఏఐవైఎఫ్‌

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:29 AM

టెట్‌ దరఖాస్తు ఫీజును తగ్గించాలని ఏఐవైఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాతే దరఖాస్తులను స్వీకరించాలని కోరింది. దీంతో పాటు 33 జిల్లాల్లోనూ

టెట్‌ ఫీజు తగ్గించాలి: ఏఐవైఎఫ్‌

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): టెట్‌ దరఖాస్తు ఫీజును తగ్గించాలని ఏఐవైఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాతే దరఖాస్తులను స్వీకరించాలని కోరింది. దీంతో పాటు 33 జిల్లాల్లోనూ టెట్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్‌ ఎం. రాధారెడ్డికి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో టెట్‌ ఒక పేపర్‌ దరఖాస్తు ఫీజు రూ.200, రెండు పేపర్లకు రూ.300 ఉండేదని, ప్రస్తుతం పేపర్‌-1కు రూ.1000, రెండు పేపర్లకు రూ.2000 ఫీజు నిర్ణయించడం సమంజసం కాదన్నారు. అలాగే 11 జిల్లా కేంద్రాల్లోనే టెట్‌ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని, దీనివల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడతారని తెలిపారు.

Updated Date - Mar 27 , 2024 | 04:29 AM