‘పది’ మూల్యాంకనం ప్రారంభం
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:37 PM
జిల్లాలో పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంక నం బుధవారం నాడు ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ఇతర జిల్లాలకు చెందిన పదో తరగతి జవాబు పత్రాలను మూ ల్యాంకనం చేస్తున్నారు.

‘పది’ మూల్యాంకనం ప్రారంభం
నల్లగొండ, ఏప్రిల్ 3: జిల్లాలో పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంక నం బుధవారం నాడు ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ఇతర జిల్లాలకు చెందిన పదో తరగతి జవాబు పత్రాలను మూ ల్యాంకనం చేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ ప్ర క్రియ కొనసాగుతుంది. ఈనెల 11వ తేదీ నాటికి జిల్లాకు కేటాయించిన 2 లక్షల కు పైగా జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. మొదటి రోజు మూల్యాంకనం కోసం కేటాయించిన ఉపాధ్యాయులు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు, స్పెషల్ అసిస్టెంట్లు మూల్యాంకనం కేంద్రానికి హాజరై జాయినింగ్ రి పోర్టు ఇచ్చారు. మధ్యాహ్నం నుంచి మూల్యాంకనం చేపట్టగా గురువారం నుంచి పూర్తిస్థాయిలో ప్రక్రియ కొనసాగనుంది. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల క్యాంపు అధికారిగా డీఈవో బొల్లారం భిక్షపతి పర్యవేక్షిస్తున్నారు.