Share News

Telangana: ఆకట్టుకున్న తెలంగాణ శకటం.. థీమ్ చూస్తే అదుర్స్

ABN , Publish Date - Jan 26 , 2024 | 01:04 PM

దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు(Republic Day 2024) ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల కవాతు, శకటాల ప్రదర్శన జరిగాయి.

Telangana:  ఆకట్టుకున్న తెలంగాణ శకటం.. థీమ్ చూస్తే అదుర్స్

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు(Republic Day 2024) ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల కవాతు, శకటాల ప్రదర్శన జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, అభివృద్ధి తదితర అంశాలను చూపిస్తూ శకటాల ప్రదర్శన జరిగింది.

తెలంగాణకు చెందిన శకటం విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ పోరాట యోధుల థీమ్‌తో దీన్ని రూపొందించారు. Democracy at the grassroots: The Legacy of Telangana's Freedom Fighters అనేది థీమ్. పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలా డిజైన్ ఉంది.

Updated Date - Jan 26 , 2024 | 01:15 PM