Share News

Vyuham: వ్యూహం మూవీపై హైకోర్టు.. తీర్పు వాయిదా

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:24 PM

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న వ్యూహం(Vyuham Movie) సినిమాపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వాయిదా వేసింది. తీర్పును జనవరి 22కు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. అప్పటివరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది.

Vyuham: వ్యూహం మూవీపై హైకోర్టు.. తీర్పు వాయిదా

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న వ్యూహం(Vyuham Movie) సినిమాపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వాయిదా వేసింది. తీర్పును జనవరి 22కు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. అప్పటివరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది. ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగిశాయి.

వ్యూహం కు సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికేట్ ను నిలిపేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని ఆ సినిమా నిర్మాత తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందని భావిస్తే, తెలంగాణలోనైనా విడుదలకు అనుమతివ్వాలని కోరారు.

దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తరఫు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యూహం సినిమా చిత్రీకరించారని ఆరోపిస్తూ సినిమా ప్రదర్శనకు సీబీఎఫ్‌సీ ధ్రువపత్రం జారీ చేయడాన్ని సవాలు చేస్తూ గతంలోనే పిటిషన్ వేశారు.

Updated Date - Jan 12 , 2024 | 05:24 PM