Share News

TS News: రేషన్‌కార్డుల ఈ-కేవైసీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ABN , Publish Date - Jan 28 , 2024 | 07:31 AM

రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ పూర్తి చేయనివారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు తేదీని పొడగిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. ఫిబ్రవరి చివరి వరకు ఈ-కేవైసీకి అవకాశం ఇస్తున్నట్టు వెల్లడించింది.

TS News: రేషన్‌కార్డుల ఈ-కేవైసీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ పూర్తి చేయనివారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు తేదీని పొడగిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. ఫిబ్రవరి చివరి వరకు ఈ-కేవైసీకి అవకాశం ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండడంతో రేషన్ షాపులకు రేషన్‌కార్డుదారులు పోటెత్తుతున్నారు. చాలా చోట్ల భారీ లైన్లు కనిపిస్తున్నాయి. రద్దీ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం గడువు తేదీని పెంచింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 75 శాతం మంది రేషన్‌కార్డు దారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.

Updated Date - Jan 28 , 2024 | 07:32 AM