తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది
ABN , Publish Date - Sep 13 , 2024 | 12:12 AM
రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర గొప్పదని, భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం తమ ప్రాణాలు అర్పించి పోరాటం కొనసాగించారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు.
తుంగతుర్తి, సెప్టెంబరు 12: రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర గొప్పదని, భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం తమ ప్రాణాలు అర్పించి పోరాటం కొనసాగించారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న శౌర్యయాత్ర గురువారం కొత్తగూడెం గ్రామానికి చేరుకుంది. భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా ఈ ప్రాంతంలో 10లక్షల భూములను పేదవారికి పంచినట్లు గుర్తుచేశారు. నాలుగు వేల మంది అమరవీరుల బలిదానంతో మూడు వేల గ్రామాలు స్వరాజ్యాన్ని సాధించాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, బుర్ర శ్రీనివాస్, పులుసు సత్యం, నాయకులు తాటి విజయమ్మ, సుదర్శన్, ముత్తయ్య, మల్లయ్య, పాపయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్, నరసింహ పాల్గొన్నారు.
నూతన్‌కల్: పేదల కోసం పోరాడి అమరులైన నాయకుల ఆశయ సాదనకు కృషిచేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి కోరారు. మండలంలోని చిల్పకుంట్లలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, కందాళ శంకర్‌రెడ్డి, పులుసు సత్యం, బొజ్జ శ్రీని వాస్, తొట్ల లింగయ్య, కూసు సైదులు, శ్రీనివాస్‌రెడ్డి, తిరుమలేష్ ఉన్నారు.
కోదాడ రూరల్: కమ్యూనిస్టుల పోరాట ఫలితమే తెలంగాణ విముక్తి అని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ 76వ వార్షికోత్సవాల సందర్భంగా గురువారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కొన్ని పార్టీలు చరిత్రను వక్రీకరించి వారికి అనుకూలంగా మార్చుకున్నాయన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విముక్త పోరాటమే నిజమైన పోరాటమన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు, పట్టణ కార్యదర్శి షేక్ లతీఫ్ పాల్గొన్నారు.
సూర్యాపేటటౌన్: ఈ నెల 13వతేదీ నుంచి 17వ తేదీ వరకు విద్రోహ దినంగా నిర్వహించాలని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. నిజాం ప్రభు భూస్వాముల, జాగీర్‌దారుల, దేశ్‌ముఖ్‌లు నిరంకుశ పాలన సాగిస్తున్న సమయంలో కమ్యునిస్టుల నాయకత్వంలో ప్రజాపోరాటాలు చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు గంట నాగయ్య, కునుకుంట్ల సైదులు, పోలెబోయిన కిరణ్, నర్సింహారావు, అశోక్‌రెడ్డి, బండి రవి, నర్సిరెడ్డి, వినోద్‌రెడ్డి, శ్రీధర్, లింగయ్య, రామనర్సయ్య పాల్గొన్నారు.
చిలుకూరు: తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనకు కృషిచేయాలని సీపీఐ సీనియర్ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డా నారాయణరావు అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో బేతవోలు, చిలుకూరు, నారాయణపురం, జెర్రిపోతులగూడెం గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్థూపాలను ఆవిష్కరించి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, బెజవాడ వెంకటేశ్వర్లు, ఉస్తెల సృజన, మండవ వెంకటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, కొండా కోటయ్య, చేపూరి కొండలు, మల్లేశ్వరి, రెమిడాల రాజు, సాహెబ్ అలీ పాల్గొన్నారు.
తుంగతుర్తి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలని సీపీయూఎస్‌ఐ దళిత బహుజన శ్రామిక విముక్తి రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారంతో దళం సేదతీరుతున్న సమయంలో ఏకపక్షంగా కాల్పులు జరిపి ఎన్‌కౌంటర్ అని కట్టుకథ అల్లుతున్నారని, హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరారు.