Share News

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:22 AM

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకో వాలని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌ కోరారు. ధర్మపురి మండలంలోని పెద్దనక్క లపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయ న ప్రారంభించారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకో వాలని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌ కోరారు. ధర్మపురి మండలంలోని పెద్దనక్క లపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఆరుగాలం రైతులు కష్టించి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుక వచ్చి మద్దత్తు ధర పొందాలని అన్నారు. రైతులు వరి ధాన్యాన్ని 17 శాతం తేమతో కొనుగోలు కేంద్రాలకు తీసుక రావాలని, దళారీలకు విక్రయించి మోసాలకు గురికావద్దని ఆయ న తెలిపారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బం దులు కలుగనీయకుండా సంబంధిత అధికారులు ప్రత్యే క దృష్టి సారించాలన్నారు. రైతులకు గన్ని సంచుల కొ రత, ఇతరత్రా సమస్యలు ఉంటే నేరుగా తనకు ఫోన్‌ చేయాలని ఆయన కోరారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతుల ప్రయోనం కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు తన క్యాంపు కార్యాల యంలో వెలగటూర్‌ మండంలోని కోటిలింగాల మాజీ సర్పంచ్‌ నక్క మౌనిక-రవితేజ ఆయన సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ధర్మ పురి పట్టణ పద్మశాలి సేవా సంఘం నూతన అధ్య క్షుల కొంక సుదీర్‌కుమార్‌ను కూడ శాలువా కప్పి ఆ యన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఏ ఎంసీ చైర్‌పర్సన్‌ చిలుముల లావణ్య, ఐకేపీ చరణ్‌ దాస్‌, డీపీఎం వెంకటేష్‌, ఏపీఎం రమాదేవి, టీపీ పీసీ సభ్యులు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు సంగన భట్ల దినేష్‌, వైస్‌చైర్మన్‌ సంగ నర్సింహులు, పాలకవ ర్గ సభ్యులు ఎన్నం మదుకర్‌రెడ్డి, ఎండీ రఫియొద్దీన్‌, గంధం రాజయ్య, తొట్ల రాజన్న, సింహరాజు ప్రసాద్‌, బాదినేని సత్యనారాయణ, శ్రీహరి, సత్యనా రాయణ, ప్ర భాకర్‌, దాసరి పురుషోత్తం, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:23 AM