పౌరుషానికి ప్రతీక..ఐలమ్మ
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:42 PM
చాకలి ఐలమ్మ జీవితం అందరికీ ఆదర్శమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- చాకలి ఐలమ్మ వర్ధంతిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- జిల్లా అంతటా ఆమె చిత్రపటాలకు నివాళి
పాలమూరు, సెప్టెంబరు 10 : చాకలి ఐలమ్మ జీవితం అందరికీ ఆదర్శమని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్ట్ ప్రాంతంలో ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపోరాటానికి నాంది పలికిన వీరవనిత, తెలంగాణ పౌరుషానికి ప్రతీక చాకలి ఐలమ్మ అన్నా రు. భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణన ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీరమాత చాకలి ఐలమ్మ అన్నారు. ఐలమ్మ లాంటి మహనీయుల చరిత్ర భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డీసీసీ కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, లక్ష్మణ్‌యాదవ్, రాషెద్‌ఖాన్, పాషా, తిరుమల వెంకటేష్, సయ్యద్ మోసిన్, సుధాకర్‌రెడ్డి, సి.జె బెనహర్, నవనీత, మల్లు నరసింహారెడ్డి, రాములుయాదవ్, అజ్మత్‌అలీ, భరత్, పురుషోత్తం, బెజుగం రాఘవేందర్, శివశంకర్, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి నివాళి : తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని మాజీ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఐలమ్మ విగ్రహానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ కె.సి.నరసింహులు, గంజి వెంకన్న, టి.గణేష్, రామలక్ష్మణ్, కట్టా రవికిషన్‌రెడ్డి, శివరాజు, నవకాంత్, తిరుపతమ్మ, పాల సతీష్, సుధాకర్, కిషన్, పవన్ పాల్గొన్నారు.
ఫ భూస్వాములను ఎదిరించిన ఐలమ్మ : తెలంగాణ సాయధు పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ దొరలు, భూస్వాములను ఎదిరించిన వీరవనిత అని సీఐటీయూ నాయకులు కిల్లె గోపాల్, నల్లవెల్లి కురుమూర్తి అన్నారు. భూత్పూర్ మండలం, అన్నాసాగర్‌లో మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్థంతిని నిర్వహించారు.